Site icon NTV Telugu

Imran Khan: కుడి కంటిచూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్..

Imran Khan

Imran Khan

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం ప్రమాదంలో పడింది. రెండున్నరేళ్లగా రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఆయన కంటి చూపు కోల్పోయినట్లు తాజా నివేదిక చెబుతోంది. సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ సల్మాన్ సప్దార్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పాక్ సైన్యం ఉద్దేశపూర్వకంగా, అమానవీయంగా, చట్టవిరుద్ధంగా ఇమ్రాన్ ఖాన్‌ను నిర్బంధించినట్లు నివేదిక బహిర్గతం చేసింది. జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్‌ను వైద్యం అవసరమని చెప్పినా పట్టించుకోలేదు. ఆయన తన కుడి కంటిలో 85 శాతం చూపు కోల్పోయినట్లు తెలిసింది.

Read Also: Food vlogger: వ్యూస్ కోసం ‘‘డెవిల్ క్రాబ్’’ను తిన్న ఫుడ్ వ్లాగర్.. చివరకు..

మాజీ ప్రధానిని ఒంటరిగా జైలులో ఉంచడంతో పాటు కుటుంబ సభ్యుల కలయికను నిరాకరించడం, న్యాయవాదుల్ని అనుమతించకపోవడం వంటివి ఆయన మద్దతుదారుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అక్టోబర్ 2025 వరకు రెండు కళ్లలో సాధారణంగా 6 x 6 దృష్టి ఉండేదని సఫ్దార్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత క్రమక్రమంగా కంటి అనారోగ్యం మొదలైనట్లు వెల్లడించారు. జైలు సూపరింటెండెంట్‌కు పదే పదే ఆరోగ్య సమస్యల్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదని తెలుస్తోంది. 73 ఏళ్ల ఇమ్రాన్ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కోర్టుకు తెలిపారు.

Exit mobile version