MLC Kavitha : జగిత్యాలలో జరిగిన దారుణ ఘటనపై తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ దివ్యాంగుడిని, కలెక్టర్ ఎదుటే కానిస్టేబుల్ ఈడ్చి, అతని వీల్‌చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లిన ఘటనపై ఆమె స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎమ్మెల్సీ కవిత ఈ సంఘటనను “ప్రజాపాలన అంటే ఇదేనా?” అని ప్రశ్నిస్తూ, దీనిని అత్యంత దుర్మార్గమైన చర్యగా ఖండించారు. బాధ్యుడైన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు…
పోలీసుల దౌర్జన్యం పెరుగుతోంది. తాజాగా ఓ పోలీసు అధికారి రోడ్డు మధ్యలో ఓ దుకాణదారుడిని చెంపదెబ్బ కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. పోలీసుల క్రూరత్వానికి ఈ వీడియో ఓ ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోను 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించారు.
జగన్మోహన్ రెడ్డిపై దాడి ఘటన కేసులో నిందితుడు సతీష్ కుటుంబ బాధితులను రిటైర్డ్ ఐపీఎస్ వెంకటేశ్వరరావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు. మనుషుల్ని వాళ్ళ జీవితాల్ని తొక్కుకుంటూ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు వైఖరికి సతీష్ పై పెట్టిన కేసు ఒక తార్కాణమని ఎద్దేవా చేశారు. పేద వడ్డెర కులస్తుడైన సతీష్ పై అక్రమ కేసు బనాయించి అతని జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేశారన్నారు.