Groundwater Pumping: భూమిపై విచ్చల విడిగా భూగర్భ జలాలను తోడేస్తున్నాము. ఏటా కొన్ని మిలియన్ టన్నుల నీటిని మానవుడు తన అవసరాల కోసం వాడుతున్నాడు. అయితే దీని నుంచి ఎదురయ్యే పరిణామాలను పట్టించుకోవడం లేదు. భూమి అంతర్భాగం నుంచి నీటిని తోడేసి వాటిని వేరే చోటుకు పంపడం ఏకంగా భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షంపై కూడా ఇది ప్రభావం చూపిస్తోందని శాస్త్రవేత్తలు తేల్చారు. భూగర్భ జలాల తోడేయడం వల్ల 1993 నుంచి 2010 మధ్య కాలంలో భూమి ఏకంగా దాదాపుగా 80 సెంటీమీటర్లు తూర్పువైపు వంగింది. ఈ వివరాలను జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. భూమి యొక్క భ్రమణాన్ని మార్చగల నీటి సామర్థ్యం 2016లో కనుగొనబడిందని పరిశోధకులు గుర్తించారు.
Read Also: Virendra Sachdeva: మహిళల భద్రత పేరుతో కేజ్రీవాల్ ప్రభుత్వం 800 కోట్ల కుంభకోణానికి పాల్పడింది
1993-2010 మధ్యకాలంలో 6 మిల్లీమీటర్ల సముద్ర మాట్టం పెరుగుదలకు సమానమైన 2,150 గిగా టన్నుల( 2 ట్రిలియన్ టన్నులు) భూగర్భ జలాలను కోల్పోయాం. ఈ మధ్యకాలంలో భౌగోళిక ఉత్తర ధ్రువం సంవత్సరానికి 4.36 సెంటీమీటర్ల వేగంతో మారడానికి కారణమైందని పరిశోధకులు లెక్కించారు. వాతావరణ సంబంధిత కారణాల్లో భూగర్భ జలాల పంపిణి వాస్తవానికి భ్రమణ ధ్రువంపై అతిపెద్ద ప్రభావం చూపిస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన దక్షిణ కొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్శిటీలో జియోఫిజిసిస్ట్ కి-వీన్ సియో చెప్పారు. అధ్యయన కాలంలో పశ్చిమ ఉత్తర అమెరికా, వాయువ్య భారతదేశంలో ఎక్కువ నీరు రీడిస్ట్రిబ్యూషన్ జరిగిందని కనుగొన్నారు.
భూమి భ్రమణ అక్షం సాధారణంగా ఒక సంవత్సరంలో అనేక మీటర్లు మారుతుంది. కాబట్టి భూగర్భ జలాల పంపింగ్ రుతువులపై పెద్దగా మార్పులు సంభవించవు. అయితే భౌగోళిక సమయ ప్రమాణాలపై, ధ్రువ ప్రవాహం వాతావరణంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెప్పారు. నీటి ద్రవ్యరాశిలో మార్పులు భూమి యొక్క అక్షం వంపుకు కారణం అవుతున్నాయి. హిమానీనదాలు మరియు మంచు గడ్డలు కరిగించడం వల్ల కూడా ఇది సంభవిస్తుంది.