GoDaddy layoff: లేఆఫ్స్ జాబితాలో మరో కంపెనీ కూడా చేరిపోయింది. ప్రముఖ వెబ్ హోస్టింగ్ ప్లాట్ ప్లాట్‌ఫారమ్ గోడాడీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. తన సిబ్బందిలో 8 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గోడాడీ సీఈఓ అమన్ భూటానీ మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక పరిణామాల వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బందికి పంపిన ఈమెయిల్స్ లో ఈ ఉద్యోగులు తొలగింపుకు కారణాలు వెల్లడించారు.