Nepal Gen Z Protests: రెండు నెలల క్రితం జరిగిన జెన్-జెడ్ నిరసనలతో నేపాల్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తాజాగా మళ్లీ నేపాల్ యువతలో ఆగ్రహం చెలరేగింది. బారా జిల్లాలోని సిమ్రా ప్రాంతంలో పరిస్థితి మరోసారి దిగజారింది. బుధవారం జెన్-జెడ్ యువత, సీపీఎన్-యూఎంఎల్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఉద్రిక్తత తర్వాత గురువారం జెన్-జెడ్ యువత మళ్లీ నేపాల్ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. పరిస్థితిని నియంత్రించడానికి జిల్లా యంత్రాంగం మధ్యాహ్నం 12:45 నుంచి…
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువతి చేపట్టిన ఆందోళనల తర్వాత ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రి వర్గంలో చాలా మంది రాజీనామాలు సమర్పించారు. అయితే, నేపాల్‌కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుశీలా కర్కీ ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలిసింది.
Sushila Karki: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా జెన్-జెడ్ యువతి చేసిన నిరసనలు నేపాల్‌లో హోరెత్తాయి. సోమవారం జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపైకి భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో 19 మంది మరణించారు. దీంతో, ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీతో పాటు ఆయన ప్రభుత్వంలో మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం, దేశాన్ని ఆర్మీ తన కంట్రోల్‌కి తీసుకుంది. ఇదిలా ఉంటే, నేపాల్‌కు కాబోయే తదుపరి ప్రధానమంత్రిపై చర్చించడానికి 5000…