Sushila Karki: నేపాల్‌లో కొత్త శకం మొదలైంది. హిమాలయ దేశానికి తొలి మహిళా ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కీ ప్రమాణస్వీకారం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా జెన్-జెడ్ నిరసనకారులు చేసిన ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జెన్-జెడ్ ప్రతినిధులు, ఆర్మీ, అధ్యక్షుడితో జరిపిన చర్చల్లో సుశీల కర్కీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆమె చేత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణస్వీకారం చేయించారు.
నేపాల్‌లో అవినీతికి వ్యతిరేకంగా యువతి చేపట్టిన ఆందోళనల తర్వాత ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేశారు. ఆయన మంత్రి వర్గంలో చాలా మంది రాజీనామాలు సమర్పించారు. అయితే, నేపాల్‌కు ప్రస్తుతం తాత్కాలిక ప్రధానిగా మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుశీలా కర్కీ ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలిసింది.
Nepal Protests: సోషల్ మీడియా బ్యాన్‌కు వ్యతిరేకంగా నేపాల్ అట్టుడుకుతోంది. జెన్-జీ యువత పెద్ద ఎత్తున నిరసన తెలుపుతునున్నారు. ఈ నిరసన హింసాత్మక చర్యలకు దారి తీసింది. ఆందోళనకారులు ప్రధాని కేపీ ఓలీ నివాసంతో పాటు అధ్యక్షుడి నివాసం, సుప్రీంకోర్టు, పార్లమెంట్ భవనాలపై దాడులు చేసి, నిప్పటించారు.