ట్రంప్-ఎలాన్ మస్క్ సంబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలు, నీళ్లు కలిసిపోయినట్లుగా 2024 అమెరికా ఎన్నికల సమయంలో కలిసి తిరిగారు. ఇక అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ ట్రంప్ పక్కనే కనిపిస్తూ ఉండేవారు. ఓవల్ కార్యాలయంలో మస్క్.. తన కొడుకును భుజాలపై ఎక్కించుకుని ట్రంప్ పక్కనే ఉండేవారు. అంతగా కలిసి మెలిసి తిరిగిన ట్రంప్-మస్క్ మధ్య ఏం చెడిందో.. ఏమైందో తెలియదు గానీ ట్రంప్ లక్ష్యంగా మస్క్ విమర్శలు గుప్పించారు. అనంతరం నెమ్మది.. నెమ్మదిగా స్నేహం చెడింది. తాజా పరిణామాలను బట్టి చూస్తే.. ఆ బంధం పూర్తిగా తెగిపోయినట్లుగా అర్థమవుతోంది.

గురువారం ట్రంప్ వైట్‌హౌస్‌లో టెక్ సీఈవోలకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ విందుకు అమెరికాలో ఉన్న దిగ్గజ టెక్ సీఈవోలంతా హాజరయ్యారు. కానీ ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ మాత్రం కనిపించలేదు. మొన్నటిదాకా వైట్‌హౌస్‌లోనే ఉన్న మస్క్ ఇప్పుడు గైర్హాజరయ్యారు. దీంతో ట్రంప్-మస్క్ మధ్య స్నేహం పూర్తిగా చెడినట్లుగా తెలుస్తోంది. ట్రంప్ పక్కన బిల్ గేట్స్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, పిచాయ్ సహా టెక్ నాయకులంతా కనిపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్ సంస్థల నుంచి డజను మంది హాజరైనట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈ సందర్భంగా ఏఐ విధానంపై ప్రత్యేకంగా చర్చించారు.
ఇది కూడా చదవండి: Sri Lanka: శ్రీలంకలో ఘోర విషాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి
వైట్‌హౌస్‌లో పొడవైన టేబుల్ ఏర్పాటు చేశారు. అందులో అమెరికా ప్రథమ మహిళ మెలానియా పక్కన బిల్ గేట్స్, ట్రంప్ పక్కన జుకర్‌బర్గ్ కూర్చున్నారు. ఎదురుగా పిచాయ్, కుక్ కనించారు. ఇక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ టాస్క్ ఫోర్స్ సమావేశానికి మెలానియా ట్రంప్ అధ్యక్షత వహించారు. ఏఐ గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు.

వాస్తవంగా ఈ విందు రోజ్ గార్డెన్‌లో ఏర్పాటు చేయాలని భావించారు. గార్డెన్‌లోని పచ్చికను కూడా చదును చేశారు. టేబుళ్లు, కుర్చీలు, గొడుగులు ఏర్పాటు చేశారు. గురువారం మధ్యాహ్నం అనుహ్యంగా వర్షం కురిసింది. దీంతో ఈవెంట్‌ను వైట్‌హౌస్ స్టేట్ డైనింగ్ రూమ్‌కు మార్చారు.
ఇది కూడా చదవండి: Joe Biden: మాజీ అమెరికా అధ్యక్షుడుకు ఏమైంది? తలపై ఆ గాయమేంటి?
విందు అతిథుల జాబితాలో గూగుల్ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్, వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్, ఒరాకిల్ సీఈఓ సఫ్రా కాట్జ్, బ్లూ ఆరిజిన్ సీఈఓ డేవిడ్ లింప్, మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా, టిఐబిసిఓ సాఫ్ట్‌వేర్ చైర్మన్ వివేక్ రణదివే, పలంటిర్ ఎగ్జిక్యూటివ్ శ్యామ్ శంకర్, స్కేల్ ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెగ్జాండర్ వాంగ్, షిఫ్ట్4 పేమెంట్స్ సీఈఓ జారెడ్ ఇసాక్‌మాన్ ఉన్నారని వైట్ హౌస్ ధృవీకరించింది. మస్క్ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
Trump hosts top tech leaders at White House dinner — Zuckerberg, Bill Gates, and OpenAI’s Sam Altman all in attendance pic.twitter.com/xZtEXCW1Ze
— Catch Up (@CatchUpFeed) September 5, 2025