US Elections Results: హోరా హోరీగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయి. ఒకవైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కెంటకీ, ఇండియానా, జార్జియా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, మిసిసిపి, టెక్సాస్, ఓక్లహామా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. మొత్తం 101 ఎలక్టోరల్ ఓట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే, ఫ్లోరిడాలోని మొత్తం 30 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ ఖాతాలోకి వచ్చాయి.
Read Also: Harish Shankar: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్‌పై రానా జోకులు.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్
అలాగే, న్యూజెర్సీ, వెర్మాంట్, మేరల్యాండ్, కనెక్టికట్, పెన్సిల్వేనియా, కన్సాస్ సహా 8 రాష్ట్రాల్లో కమలా హ్యారిస్ ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆమె 71 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. అత్యంత కీలకమైన స్వింగ్ స్టేట్ జార్జియాలో హారిస్ ఎదురీదుతుంది. 2020 ఎన్నికల్లో ఈ రాష్ట్రం డెమోక్రట్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను సాధించింది. అదే సమయంలో పెన్సిల్వేనియాలో మాత్రం కీలకమైన పిట్స్‌బర్గ్, ఫిలడెల్ఫియాలో ఆమె ముందుంజలో కొనసాగుతున్నారు. దీంతో ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, ఐయోవాలోని స్టోరీ కౌంటీ, ఏమ్స్ నగరంలో ఓటింగ్ యంత్రాలు కాసేపు మొరాయించాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు. పౌరులు ఓటేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ప్రతినిధి తెలిపారు. దీంతో ఫలితాల వెల్లడిలోనే జాప్యం జరిగే ఛాన్స్ లేదన్నారు.