Joe Biden: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరుఫున ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్‌కి వ్యతిరేకంగా నిలబడిన డెమొక్రాట్ అభ్యర్థి, ఉపఅధ్యక్షురాలు కమలా హారిస్ ఓడిపోయారు. నిజానికి ముందుగా ట్రంప్‌కి పోటీగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ని అనుకున్నప్పటికీ, డెమొక్రటిక్ పార్టీ పట్టుబట్టీ మరి కమలా హారిస్‌కి అధ్యక్ష అభ్యర్థిత్వం ఇచ్చింది.
Donald Trump: హిందువులతో పాటు మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని భారతీయ అమెరికన్లు కోరుతున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌పై ఆర్థిక ఆంక్షలు విధించడంతో పాటు చర్యలు తీసుకోవాలని వచ్చే ఏడాది ఏర్పాటు కాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌ని, యూఎస్ కాంగ్రెస్‌ని సంప్రదించడానికి భారతీయ అమెరికన్లు కృషి చేస్తున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2016లో ఆయన సాధించిన ఫలితాల కన్నా మెరుగైన ఫలితాలను అందుకున్నారు. ముఖ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్ణయించి స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ సత్తా చాటాడు. ఏకంగా 7 స్వింగ్ రాష్ట్రాలను కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశాడు. తాజాగా అరిజోనాని కూడా ట్రంప్ తన ఖతాలో వేసుకోవడంతో మొత్తం స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ఆధిపత్యం ప్రదర్శించారు.
అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 6 వరకు గూగుల్ ట్రెండ్స్ డేటా తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రం మినహా మిగతా అన్ని భారతీయ రాష్ట్రాలు కమలా హరీస్ కంటే డొనాల్డ్ ట్రంప్ గురించి గూగుల్ లో ఎక్కువగా శోధించాయని పేర్కొనింది.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై ఆయన విజయం సాధించారు. 2016 నుంచి 2020 వరకు అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన ట్రంప్.. అధ్యక్షుడిగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ఒక్క అమెరికాకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శించింది.
US Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఈ ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు ఉత్కంఠగా కొనసాగుతుంది. తొలుత ట్రంప్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. హారిస్ కూడా బలంగా పుంజుకుంది.
US Elections Results: హోరా హోరీగా కొనసాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలు వచ్చేశాయి. ఒకవైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే.. కెంటకీ, ఇండియానా, జార్జియా, సౌత్ కరోలినా, వెస్ట్ వర్జీనియా, మిసిసిపి, టెక్సాస్, ఓక్లహామా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు.
Donald Trump: బంగ్లాదేశ్‌లో మరోసారి హిందువులపై జరిగిన దాడిని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే భారత్‌తో అమెరికా సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తామన్నారు.
Putin Elon Musk: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య రహస్య సంబంధాలు ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. 2022 నుంచి వీరిద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారని తెలిపింది.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడింది. నవంబర్ 5న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రోజు మంగళవారం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అమెరికాలో గత 170 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నికలు మంగళవారమే జరుగుతున్నాయి. ఇది 1840 సంవత్సరంలో ప్రారంభమైంది. 1845 సంవత్సరంలో, యూఎస్ కాంగ్రెస్ ఒక చట్టం చేసింది. దాని ప్రకారం నవంబర్ మొదటి వారంలోని మంగళవారం అధ్యక్ష ఎన్నికలకు నిర్ణయించబడింది.