Donald Trump: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్..!
- తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులను తరిమేస్తా..
- చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తాం..
- అమెరికాకు రావాలని అనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి: డొనాల్డ్ ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తాను అధ్యక్ష పదవి చేపట్టగానే అక్రమ వలసదారులు అందరినీ అమెరికా నుంచి తరిమేస్తానని వెల్లడించారు. అలాగే, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం మరింత సులువుగా చేస్తానని కాబోయే యూఎస్ అధ్యక్షుడు తెలిపారు. ఇది భారతీయులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే, అమెరికాకు రావాలని అనుకునేవారు ఈ దేశాన్ని ప్రేమించాలి.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఏమిటో చెప్పగలగాలని డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.
Read Also: Mumbai: కర్ణాటకలోని బెలగావిని యూటీ చేయండి.. మోడీకి ఆదిత్య థాక్రే విజ్ఞప్తి
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
అయితే, కొన్ని దేశాల జైళ్ల నుంచి నేరస్థులు డైరుక్టుగా అమెరికాకు వచ్చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అలాంటి 13,099 మంది నేరస్థులు యూఎస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదకర వ్యక్తులను మన దేశంలో ఉండనివ్వొద్దని తెలిపారు. వారిని తక్షణం వెళ్లగొట్టాలని ఆయన చెప్పారు. ఇక, అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన తల్లిదండ్రుల సంతానంలో చాలా మంది ఇక్కడే పుట్టి పెరిగారు.. వారిలో చాలా మంది గొప్ప మంచి ఉద్యోగాలు, వృత్తులు చేస్తున్నారు.. కాట్టి వారి సమస్య తమ దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. డ్రీమర్స్ సమస్యకు ప్రతిపక్ష డెమోక్రాట్లతో కలిసి ఒక పరిష్కారం కనుగొంటానని ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ(92) కన్నుమూత.
పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోల నుంచి అమెరికాలోకి లక్షల మంది అక్రమ వలసదారులు పోటెత్తుతున్నారని, దీన్ని నిరోధించకపోతే ఆ రెండు దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తానని ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై రెండు దేశాలు హాహాకారాలు చేయగా కెనడా, మెక్సికోలు అమెరికాలో 51వ, 52వ రాష్ట్రాలుగా చేరిపోవడం మంచిదని ఆయన సలహా ఇచ్చారు. అమెరికా ఇప్పటికే కెనడాకు 10,000 కోట్ల డాలర్లు, మెక్సికోకు 30,000 కోట్ల డాలర్ల చొప్పున రాయితీలు ఇస్తోందనీ, వీటిని కట్టిపెట్టాల్సి ఉందన్నారు. చైనా తదితర దేశాలపై సుంకాలు పెంచితే సరకుల ధరలు పెరిగి సామాన్య అమెరికన్ పౌరులు నష్టపోతారని కంపెనీల సీఈవోలు కొందరు చేస్తున్న హెచ్చరికలను ట్రంప్ తోసిపుచ్చారు. సుంకాల సాయంతో తాను యుద్ధాలు ఆపానన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!