Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
- చరిత్ర సృష్టించిన వయోజర్-1
- నేటితో ఒక కాంతి రోజు దూరానికి..
- అత్యంత దూరం ప్రయాణించిన మానవ నిర్మిత వస్తువు..
- సూర్య మండలం దాటి ప్రయాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Voyager 1: దాదాపు 49 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన వయోజర్-1 అంతరిక్ష నౌక విశ్వంలో మరో మైలురాయిని చేరుకుంది. నేటితో భూమి నుంచి ఒక ‘‘కాంతి రోజు’’ ప్రయాణించిన చరిత్ర సృష్టించింది. నవంబర్ 18న మధ్యాహ్నం 3:46 గంటలకు వాయేజర్-1 ఒక లైట్ డే దూరాన్ని చేరుకుంది. మానవుడి చేత నిర్మితమైన విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్‌గా నిలిచింది. దాదాపు 5 దశాబ్దాల క్రితం పంపించిన ఈ అంతరిక్ష నౌక ఇప్పటికీ భూమికి అంతరిక్ష రహస్యాలను చేరవేస్తోంది.
సూర్యమండలం దాటిన వయోజర్-1
కాంతి ఒక రోజులో(24 గంటల్లో) ఎంత దూరం ప్రయాణిస్తుందో దానిని ‘‘లైట్ డే’’గా పరిగణిస్తారు. ఇది సుమారు 25.9 బిలియన్ కిలోమీటర్లు. కాంతి సెకన్‌కు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు సుమారు 61 వేల కిలోమీటర్లు ప్రయాణించే వయోజర్-1 ఈ దూరాన్ని చేరుకోవడానికి 50 ఏళ్ల పట్టింది. దీనిని బట్టి చూస్తే విశ్వం ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఇంత దూరం ప్రయాణించినా వయోజర్ కేవలం సూర్య మండలంలోని వెలుపల ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ప్రయాణిస్తోంది.
Also Read
- ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
- Iran vs America: ఇరాన్ డర్టీ బాంబ్.. అమెరికాలో అలెర్ట్!
- Trump Assassination Plot: ట్రంప్ హత్యకు కుట్ర.. పాకిస్థానీ వ్యక్తికి అమెరికాలో 27 ఏళ్ల జైలు శిక్ష!
- Russia Plane Crash: రష్యాలో ఘోర విషాదం.. గాల్లోనే అదుపుతప్పిన An-12 విమానం.. 19 మంది బలి
1977లో ప్రయోగం..
వాయేజర్-1ను 1977 సెప్టెంబర్ 5న ప్రయోగించారు. దీనిని ప్రయోగించిన తర్వాత 16 రోజులకు వయోజర్-2 ప్రయోగించారు. సౌర కుటుంబంలో గురుడు, శని, యూరేసన్, నెప్ట్యూన్ వంటి బయటి గ్రహాలను పరిశీలించేందుకు వీటిని ప్రయోగించారు. ఈ రెండు అంతరిక్ష నౌకలు గ్రహాల గురుత్వాకర్షణ శక్తినిఆసరాగా చేసుకుని ముందుకు సాగాయి. ఈ పద్ధతినే గ్రావిటేషనల్ అసిస్ట్ అంటారు. 1979లో వాయేజర్-1 బృహస్పతి (జూపిటర్) గ్రహాన్ని, 1980లో శని (సాటర్న్) గ్రహాన్ని సమీపంగా పరిశీలించింది. ఈ గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, వలయాలకు సంబంధించిన అద్భుతమైన సమాచారాన్ని భూమికి పంపించింది. 2012లో వయోజర్-1 హీలియోపాజ్ను దాటింది. సూర్యుడి నుంచి వెలువడే కణాలు, అయస్కాంత క్షేత్రాలతో ఏర్పడిన రక్షణ కవచంలో వెలుపలి సరిహద్దునే హీలియోపాజ్ అంటారు. ఆ తర్వాత దీనిని దాటేసి ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది.
1970ల టెక్నాలజీతో ఇప్పుడు కూడా పని..
వయోజర్-1 1970 నాటి టెక్నాలజీతో ఇప్పటికీ పనిచేస్తోంది. దీనికి ఉండే థర్మోఎలక్ట్రిక్ జనరేటర్ల సోలార్ ప్యానెల్స్ లేకుండా అంతరిక్ష నౌకకు విద్యుత్ ను అందిస్తున్నాయి. ఇదే సమయంలో విశ్వంలోని అత్యంత శీతల ఉష్ణోగ్రతల నుంచి నౌకను కాపాడేందుకు వేడిని విడుదల చేస్తున్నాయి. ప్లూటోనియం-238 అనే రేడియోధార్మిక పదార్థం క్షీణించడం వల్ల విడుదలయ్యే వేడిని ఈ జనరేటర్లు విద్యుత్ శక్తిగా మారుస్తాయి. ప్రతీ ఏడాది ఇలా విడుదలయ్యే విద్యుత్ తగ్గుతూ వస్తోంది. రేడియోధార్మిక పదార్థం క్షీణిస్తున్న కొద్దీ ప్రతి ఏడాది ఉత్పత్తి అయ్యే విద్యుత్ పరిమాణం తగ్గిపోతోంది.
ఈ పరిస్థితుల్లో నౌకకు సంబంధించిన కీలక పరికరాలు పనిచేసేలా, మిగతా పరికరాలను ఆపేశారు. అప్పటి సాంకేతికతతో ఇప్పటికీ విశ్వంలోని సుదూర ప్రాంతాల నుంచి సందేశాలను పంపిస్తోంది. 2030 వరకు వయోజర్ మిషన్లు కొనసాగేలా నాసా చర్యలు తీసుకుంటోంది.
ఎక్కడికి వెళ్తోంది..?
వయోజర్-1 సూర్యమండలాన్ని దాటి విశ్వంలో ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది గ్లీసే 445 అనే నక్షత్రం దిశగా ప్రయాణిస్తోంది. సుమారు 40 వేల ఏళ్ల తర్వాత ఆ నక్షత్రానికి దాదాపుగా 1.7 లైట్ ఇయర్స్ దూరం నుంచి వెళ్లే అవకాశం ఉంది. ఈ అంతరిక్ష నౌకలో గోల్డెన్ రికార్డ్ ఉంది. ఇందులో భూమిపై జీవజాలానికి సంబంధించిన శబ్దాలు, సంగీతం, వివిధ భాషల్లో పలకరింపులు, చిత్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఏదైనా గ్రహాంతర నాగరికత ఈ వ్యోమనౌకను కనుగొంటే.. భూమి గురించి తెలుసుకునే సందేశంగా వీటిని రూపొందించారు.
Voyager 1 is now one light-day from Earth, an extraordinary @NASA achievement for a spacecraft assembled by human hands and launched nearly 50 years ago. As we celebrate this milestone, with Voyager continuing her journey through interstellar space at nearly 38,000 mph, consider what those brilliant minds made possible with the technology of 1977 and how much farther we should aspire to go with the tools, resources, and ambition of our time.
— NASA Administrator Jared Isaacman (@NASAAdmin) November 18, 2026
తాజావార్తలు
-
Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
-
Shivathmika Rajasekhar: నాకు సినిమాలంటే పిచ్చి.. “రేపు నా కల నిజమవుతోంది”!
-
Nayanthara : “నేను మదర్ థెరిసాను కాను” అయితే ఏంటి? నయనతార కీలక వ్యాఖ్యలు!
-
Cyclone Akvan : ఊపిరి పీల్చుకున్న ఏపీ తీరం.. తప్పిన అతి తీవ్ర తుఫాన్ ముప్పు
-
Bancroft: బాల్ ట్యాంపరింగ్ అందరికీ తెలుసు.. ఆస్ట్రేలియా బండారం బయటపెట్టిన బ్యాన్‌క్రాఫ్ట్..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..