Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- కొలంబియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు..
- ప్రధాని మోడీ ఇతర రాజకీయ నాయకులకన్నా ప్రాథమికంగా భిన్నమైన వ్యక్తిగా ప్రస్తావన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొలంబియా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ తన 4000 కిలోమీటర్ల ‘‘భారత్ జోడో యాత్ర’’ను ప్రస్తావించారు. రాజకీయాల్లో ఇతరులతో పోటీ పడటం కన్నా, మనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకోవడం ముఖ్యమని చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ ఇందుకు ఉదాహరణ అని ప్రస్తావిస్తారు. ఇతర రాజకీయ నాయకుల కన్నా మోడీ భిన్నమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకున్న రాజకీయ నాయకుడిగా మోడీని అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, విద్యావేత్తలతో రాహుల్ గాంధీ మాట్లాడారు. తన భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ మీరు నాతో పోటీ పడాలంటే 4000 కిలోమీటర్లు నడవాలి. అయితే, మీరు 4000 కిలోమీటర్లు నడిస్తే, నన్ను కాపీ చేసినట్లు ప్రజలు అంటారు’’ అని అన్నారు. రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన నాయకుడికి ఉదాహరణగా ప్రధాని మోడీని ప్రస్తావించారు. రాజకీయ నాయకుడిగా చూస్తే మోడీ కూడా దీనితో నిజంగా పోటీ పడటం లేదని, ఆయన ఇతర రాజకీయ నాయకులందరికన్నా ప్రాథమికంగా భిన్నమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ప్రేమ, నిజాయితీ కూడా శక్తివంతమైన ఆయుధాలే అని అన్నారు.
Also Read
- Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
- UP Elections 2027: యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు షాక్ ఇవ్వనున్న అఖిలేశ్? 24 సీట్లే ఆఫర్ చేసే ఛాన్స్
- MP Govt: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట.. 'ఇద్దరు పిల్లల నిబంధన'ను ఎత్తివేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం..
- Delhi Police: రీల్స్ చేసే వారు జర్నలిస్టులు కాదు.. సుప్రీంకు ఢిల్లీ పోలీసుల నివేదిక!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
-
Telangana RERA : తెలంగాణ రెరా కీలక ఆదేశాలు.. పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై కొరడా
-
Gold Purity Test: మీ నగలు అసలైనవేనా? మార్కెట్లో ‘చైనా పౌడర్’ కల్తీ కలకలం.. ఈ టెస్టులతో సింపుల్‌గా పట్టేయండి!
-
Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..