Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ‘ఓం’ (O.M) సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 20న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల వంటి క్రేజీ కాంబినేషన్‌తో వస్తున్న ఈ మూవీపై అటు తమిళంలోనే కాదు, ఇటు తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్‌కు ఒక్కరోజు ముందు ధనుష్ తన ఎక్స్‌లో షేర్ చేసిన ఒక స్పెషల్ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా రిలీజ్ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంపై ధనుష్ హ్యాపీగా ఫీలయ్యారు. నవంబర్ 20న రిలీజ్ కానున్న ‘ఓం’ సినిమాకు ఉదయం 6 గంటల స్పెషల్ షోకు పర్మిషన్ ఇచ్చినందుకు తమిళనాడు ప్రభుత్వానికి, ముఖ్యంగా సీఎం విజయ్‌కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నట్లు ధనుష్ తన నోట్లో రాసుకొచ్చారు.
ఎర్లీ మార్నింగ్ షోలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తన అభిమానులకు ఒక ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేశారు. “ఉదయం 6 గంటల షోకు వచ్చే ఫ్యాన్స్ అందరూ సేఫ్టీ రూల్స్ పాటిస్తూ, బాధ్యతగా నడుచుకోవాలి. పక్కవాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. థియేటర్లో సినిమాను చూసి ఎంజాయ్ చేయడమే అసలైన సెలబ్రేషన్” అంటూ ధనుష్ రాసుకొచ్చారు. అంతేకాదు, ఒక సినిమా సక్సెస్ వెనుక ఎన్నో విభాగాలకు చెందిన చాలామంది కష్టం, డెడికేషన్ ఉంటాయని ధనుష్ గుర్తుచేశారు. అలాంటి సినీ కార్మికులందరికీ ఆడియన్స్ ఇచ్చే అతిపెద్ద సపోర్ట్.. థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటమేనని ఆయన పిలుపునిచ్చారు. మొత్తానికి రిలీజ్ ముందు ధనుష్ పెట్టిన ఈ పోస్ట్ అటు ఫ్యాన్స్‌లో జోష్ నింపడమే కాకుండా, బాధ్యతను కూడా గుర్తుచేసింది. మరి నవంబర్ 20న ‘ఓం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
-
Telangana RERA : తెలంగాణ రెరా కీలక ఆదేశాలు.. పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై కొరడా
-
Gold Purity Test: మీ నగలు అసలైనవేనా? మార్కెట్లో ‘చైనా పౌడర్’ కల్తీ కలకలం.. ఈ టెస్టులతో సింపుల్‌గా పట్టేయండి!
-
Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
-
ACB Raids: ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా సర్పంచ్.. ఏకంగా రూ.30 లక్షలకు బేరం..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..