కోల్‌కత్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువ చేసే 5.7 కేజీల బంగారంతో పాటు ఓ ఖరీదైన ఐ ఫోన్‌ను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. ఫ్లై దుబాయ్ విమానం క్యాబిన్ ట్రాలీ బ్యాగ్ అక్రమ బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు.
విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారుల కదలికలు పసిగట్టిన కేటుగాళ్లు దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన బంగారాన్ని విమానం క్యాబిన్ లో వదిలి వెళ్లారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్ అధికారులు. క్యాబిన్ లో దొరికిన ట్రాలీ బ్యాగ్ ఎవరిది? విమానంలో ప్రయాణించిన ప్రయాణీకుల వివరాలు సేకరిస్తున్న అధికారులు, బంగారమేనా ఇంకేమైనా డ్రగ్స్ రవాణా చేస్తున్నారా అనే కోణంలోనూ కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.