T20 World Cup 2026: అఫ్రిది టు బుమ్రా.. వరల్డ్‌కప్ చరిత్రలో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు వీరులు వీరే!
- మొట్టమొదటి ఆటగాడిగా షాహిద్ అఫ్రిది
- 2014 వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీ కింగ్
- 2024 వరల్డ్‌కప్‌లో జస్ప్రీత్ బుమ్రాకు అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘టీ20 వరల్డ్‌కప్’ అంటేనే క్షణక్షణం ఉత్కంఠ పోరు. ఈ మెగా టోర్నమెంట్‌లో జట్టు విజయం ఎంత ముఖ్యమో.. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడికి దక్కే ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు కూడా అంతే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇప్పటివరకు చాలా మంది ప్లేయర్స్ ఈ అవార్డు అందుకున్నారు. మొట్టమొదటి ఆటగాడిగా పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డుల్లో ఉన్నాడు. ఇప్పటివరకు జరిగిన ప్రతి టీ20 వరల్డ్‌కప్‌లో ఈ అవార్డు గెలిచిన ఆటగాళ్లు చరిత్రలో నిలిచిపోయారు.
2007 దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 వరల్డ్‌కప్‌లో షాహిద్ అఫ్రిది ఈ అవార్డును దక్కించుకున్నాడు. అఫ్రిది 91 రన్స్, 12 వికెట్స్ పడగొట్టాడు. 2009లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన టోర్నీలో శ్రీలంక స్టార్ తిలకరత్నే దిల్షాన్ 317 రన్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. 2010 వెస్టిండీస్‌లో ఇంగ్లాండ్ తరఫున ఆడిన కెవిన్ పీటర్సన్ కీలక ఇన్నింగ్స్‌లతో (248 రన్స్) తన ముద్ర వేశాడు. 2012 శ్రీలంకలో జరిగిన వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అద్భుత ప్రదర్శనతో (249 రన్స్, 12 వికెట్స్) ఈ అవార్డు గెలుచుకున్నాడు.
Also Read
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
Also Read: Santosh Sobhan Movie Break: సినిమాలకు బ్రేక్.. అసలు నిజం బయటపెట్టిన సంతోష్ శోభన్!
2014 వరల్డ్‌కప్‌లో కింగ్ విరాట్ కోహ్లీ అసాధారణ నిలకడతో (319 రన్స్) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచాడు. 2016 భారత వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కూడా మరోసారి విరాట్ (273 రన్స్, 1 వికెట్) ఘనతను సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2021లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలక పరుగులతో (289) జట్టును విజేతగా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 2022 ఆస్ట్రేలియాలో జరిగిన టోర్నీలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (13 వికెట్స్, 12 రన్స్) ఈ అవార్డు అందుకున్నాడు. వెస్టిండీస్-అమెరికా వేదికగా జరిగిన 2024 వరల్డ్‌కప్‌లో జస్ప్రీత్ బుమ్రా 15 వికెట్లతో అవార్డు కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టి 2026 టీ20 వరల్డ్‌కప్ (భారత్ – శ్రీలంక)పై ఉంది. ఈసారి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు ఎవరి ఖాతాలోకి వెళ్లనుందో చూడాలి.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!