తాళం వేసి వున్న ఇల్లే అతని టార్గెట్. చిటికెలో పనిముగించుకుని మాయం అవుతుంటాడు. ఒకటి కాదు రెండు 16 ఏళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. చివరికి పాపం పండింది. పోలీసులకు చిక్కాడు. కరడు గట్టిన గజదొంగను వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేశారు రాచకొండ సీసీఎస్ పోలీసులు. 2006 నుండి పోలీసులకు దొరకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు రాసికుల్ ఖాన్. రాచకొండ లో 17 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డాడు ఈ నిందితుడు రాసికుల్ ఖాన్. పలు రాష్ట్రాల్లో 100…
అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. షూస్, జీన్ ప్యాంట్ లు, ట్యాబ్లెట్లు, ఫైల్ ఫోలర్లు వేటీనీ వదిలిపెట్టడం లేదు. తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో ఓ మహిళ వేసిన ప్లాన్ ఫ్లాప్ అయింది. విదేశాలనుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. చెన్నై ఎయిర్ పోర్టులో కస్టమ్స్ తనిఖీల్లో 23 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. ఓ మహిళ తల విగ్గులో బంగారం దాచి గుట్టుగా బయటపడదామని ప్లాన్ చేసింది. అయితే కస్టమ్స్ అధికారుల ముందు ఆమె ఆటలు సాగలేదు.…
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.1.36 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శనివారం తెలిపారు. ప్రయాణికుడు శుక్రవారం దుబాయ్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.1.36 కోట్ల విలువైన 2,715.800 గ్రాముల బంగారు వస్తువులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారాలను ఏమార్చడానికి కేటుగాడు తన వెంట తెచ్చుకున్న వస్తువుల లోపల బంగారు గొలుసులు మరియు పేస్ట్ రూపంలో…
శంషాబాద్ విమనాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మగ్గురు మహిళల నుంచి 1.48కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అక్రమ బంగారం రవాణా గుట్టు. వీరిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. బంగారం విలువ సుమారు రూ.72.80 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ ద్వారా వచ్చిన మహిళలు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ఎవ్వరికి…
కోల్‌కత్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రూ.3 కోట్ల విలువ చేసే 5.7 కేజీల బంగారంతో పాటు ఓ ఖరీదైన ఐ ఫోన్‌ను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. ఫ్లై దుబాయ్ విమానం క్యాబిన్ ట్రాలీ బ్యాగ్ అక్రమ బంగారాన్ని గుర్తించిన కస్టమ్స్ అధికారులు. విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారుల కదలికలు పసిగట్టిన కేటుగాళ్లు దుబాయ్ నుండి మోసుకొని వచ్చిన బంగారాన్ని విమానం క్యాబిన్ లో వదిలి వెళ్లారు.కేసు నమోదు చేసి దర్యాప్తు…
స్మగ్లర్లు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. వివిధ వస్తువుల్లో బంగారాన్ని దాచి మరీ దేశంలోకి ఎంటరవుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో అక్రమ బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కొలంబో ప్రయాణీకుడి వద్ద 40.28 లక్షల విలువ చేసే 928 గ్రాముల బంగారం సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. సినీ పక్కీలో బంగారాన్ని పేస్టు గా మార్చి కాళ్లకు వేసుకునే చెప్పుల్లో దాచి తరలించే యత్నం చేశాడో కేటుగాడు.…
గుంటూరు నగరంలో చైన్ స్నాచింగ్‌ల ముఠా పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ముఠాపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీస్ శాఖ. గుంటూరులో వరుస చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్ని గుట్టురట్టు చేశారు పోలీసుల వారిని అరెస్ట్ చేశారు. 90 ఏళ్ళ ఓ వృద్ధురాలు మెడలో గొలుసు లాక్కొని పరారీ అయ్యాడో నిందితుడు. ముద్దాయిపై గతంలో 8 కేసులు ఉన్నాయి. దొంగిలించిన చైన్ ను లాడ్జి లాకర్ లో భద్రపరిచాడు నిందితుడు.…
బంగారం అక్రమ రవాణాకు దేన్నీ వదలడం లేదు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 18 లక్షల విలు చేసే బంగారం, ఐ ఫోన్ లతో పాటు పెర్ప్యూమ్ బాటిల్స్ ను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని, ఐ ఫోన్లను, పెర్ప్యూమ్ బాటిల్స్ లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే ప్రయత్నం చేశారు. శంషాబాద్…
బంగారం ధర చుక్కలనంటుతోంది. దీంతో స్మగ్లర్లు ఏదో ఒక రూపంలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. కస్టమ్స్ అధికారుల ముందు కేటుగాళ్ళ ఆటలు సాగడం లేదు. జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద 15 లక్షల విలువ చేసే 300 గ్రాముల బంగారం గుర్తించారు కస్టమ్స్ అధికారులు. దానిని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా సినీ ఫక్కీలో బంగారాన్ని చిన్నారులు ఆడుకునే టాయ్…