ప్రపంచంలో కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. దేశ జనాభాలో సగం మందికంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ అందించిన దేశాల్లో ఇజ్రాయిల్ కూడా ఉన్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత, వేగంగా వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు. వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టిన తరువాత, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గుముఖం పట్టడంతో బహరంగ ప్రదేశాల్లో మాస్క్ అవసరం లేదని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ ప్రకటనతో ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వస్తున్నారు.
Read: నయనతార చిత్రానికి అతడే విలన్!
దీంతో ఇప్పుడు ఆ దేశంలో మరలా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు కూడా కరోనా సోకుతుండటంతో ఆంధోళనలు మొదలయ్యాయి. పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో స్కూళ్లు కరోనా కేంద్రాలుగా మారుతున్నాయి. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 9 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది.