Chinese people protest with Bappi Lahiri song: చైనా దేశంలో జీరో కోవిడ్ ప్రోటోకాల్ తో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా జి జిన్ పింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ హిందీ పాట తెగ క్రేజ్ సంపాదించుకుంది. ఎప్పుడో 1982లో బప్పిలహరి స్వరపరిచిన ‘‘జిమ్మి..జమ్మి’’ సాంగ్ తెగ హల్చల్ చేస్తోంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలిపే ఓ పాటగా దీన్ని ఎంచుకున్నారు. 82లో మిథున్ చక్రవర్తి నటించిన ‘ డిస్కో డాన్సర్’ సినిమా కోసం బప్పి లహరి స్వరపరిచిన ఈ పాటను పార్వతి ఖాన్ పాడారు.
A sample (!) pic.twitter.com/wB8a9xi03G
— Ananth Krishnan (@ananthkrishnan) October 31, 2022
Read Also: Abhiroop Basu: ‘కాంతార’పై బెంగాలీ డైరెక్టర్ విమర్శలు.. నువ్వు డైరెక్టరా అంటూ నెటిజన్లు ట్రోల్
జీరో కోవిడ్ ప్రోటోకాల్ తో ప్రజలు అక్కడ బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. చైనా టిక్ టాక్ అయిన డౌయిన్ లో అక్కడి ప్రజలు వీడియో చేస్తూ.. ప్రభుత్వానికి తమ బాధను వ్యక్త పరుస్తున్నారు. ఈ పాటపై తెగ వీడియోలో వస్తున్నాయి. ‘జి మీ.. జీ మీ’ అంటే చైనీస్ భాషలో ‘నాకు అన్నం ఇవ్వండి’ అనే అర్థాన్ని ఇస్తుంది. దీంతో అక్కడి ప్రజలు ఒక పాత్రను పట్టుకుని అన్నం ఇవ్వండి అనే అర్థం వచ్చేలా వీడియోలు చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్కడి ప్రజలు జీరో కోవిడ్ విధానాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవుతోంది.
And another…. And there are thousands more! pic.twitter.com/z7fqu0KUFC
— Ananth Krishnan (@ananthkrishnan) October 31, 2022
కమ్యూనిస్ట్ పాలన ఉన్న చైనాలో ఇంటర్నెట్ పై తీవ్రమైన నిఘా ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారిని గుర్తించి శిక్షిస్తుంది. అలాంటి అక్కడ ప్రస్తుతం బప్పీ లహరి సాంగ్ తెగ క్రేజ్ సంపాదించుకుంటోంది. ప్రభుత్వ జీరో కోవిడ్ విధానాల వల్ల ప్రజలు ఆహారం కోసం ఎంతలా బాధపడుతున్నారో సాంగ్ ద్వారా వ్యంగ్యంగా తెలియజేస్తున్నారు ప్రజలు. దీంతో ప్రజల నుంచి అధ్యక్షుడు జిన్ పింగ్ ను తొలగించాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. 1950-60 నుంచి హిందీ సినిమాలకు చైనాలో క్రేజ్ ఉంది. రాజ్ కపూర్ కాలతం నుంచి నిన్న మొన్న వచ్చిన 3 ఇడియట్స్, దంగల్ సినిమాకు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది.