Canada: కెనడాలోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయ గోడలపై గుర్తు తెలియని దుండగులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెనడాలోని భారత హైకమిషన్ ఈ సంఘటనను ఖండించింది. కెనడా అధికారులతో విచారణ జరిపి, నేరస్థులపై సత్వర చర్యలు తీసుకోవాలని సమస్యను లేవనెత్తింది. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయ గోడలపై గ్రాఫిటీతో భారతదేశానికి వ్యతిరేక నినాదాలను రాయడాన్ని, ఆలయాన్ని అపవిత్రం చేయడాన్ని భారత హైకమిషన్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై విచారణ జరిపి, నేరస్థులపై సత్వర చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరుతున్నామని ట్వీట్ చేసింది.
Uttarpradesh: పొలంలో చెట్టుకు వేలాడుతూ ఇద్దరు యువతుల మృతదేహాలు.. అసలేం జరిగిందంటే?
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కడ ఆలయ గోడలపై ఖలిస్తానీ నినాదాలు రాసి ఉన్నాయి.బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఈ సంఘటనపై ఆవేదనను వ్యక్తం చేశారు. ఆలయంలో విధ్వంసం గురించి విని నిరాశ చెందారు. ఈ రకమైన ద్వేషానికి కెనడాలో స్థానం లేదన్నారు. నిందితులను శిక్షించి త్వరగా న్యాయం చేయాలని అధికారులనుద్దేశించి ట్వీట్ చేశారు.