కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఖలిస్థాన్ అనుకూల గుంపు దాడికి వ్యతిరేకంగా సిక్కు కార్యకర్తలు ఆదివారం న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ వెలుపల ప్రదర్శన నిర్వహించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, వివిధ హిందూ సంస్థల నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో చాణక్యపురిలోని డిప్లమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని కెనడా హైకమిషన్ ముందు భద్రతను పెంచారు.
Solidarity Rally In Canada: హిందూ దేవాలయాలపై పదేపదే జరుగుతున్న దాడులకు నిరసనగా కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో వేలాది మంది హిందువులు సోమవారం సాయంత్రం సంఘీభావ ర్యాలీని చేపట్టారు. ఈ సమయంలో, ప్రజలు ఇకపై ఖలిస్తానీలకు మద్దతు ఇవ్వవద్దని కెనడియన్ రాజకీయ నాయకులు చట్ట అమలు సంస్థలపై ఒత్తిడి తెచ్చారు. ఆలయంపై ఆదివారం ఖలిస్తానీ తీవ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ వివరాలను ఉత్తర అమెరికా హిందువుల కూటమి (CoHNA) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X…
కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కర్రలతో ఆలయంపై దాడి చేసి మతపరమైన వాతావరణాన్ని భంగపరిచారు. ఈ సంఘటన తర్వాత.. కెనడాలోని భారతీయ సమాజంలో ఆందోళన పెరిగింది. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ.. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ దృఢ సంకల్పాన్ని బలహీనపరచవని స్పష్టం చేశారు.
Canada: కెనడాలోని బ్రాంప్టన్‌లో గల ఆలయం వెలుపల హిందూ భక్తులపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి చేశారు. ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఒట్టావాలోని ఇండియన్ మిషన్ తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది.
Viral Video: కెనడాలో నిరుద్యోగం ఎలా ఆధిపత్యం చెలాయిస్తుందో చెప్పడానికి బ్రాంప్టన్ నగరంలోని ఒక రెస్టారెంట్‌లో వెయిటర్ ఉద్యోగాల కోసం గుమిగూడిన నిరుద్యోగుల గుంపు చూస్తే అర్థమవుతుంది. తాజాగా తందూరి ఫ్లేమ్ అనే కొత్త రెస్టారెంట్‌లో ఉద్యోగం కోసం ప్రకటన ఇవ్వబడిందని, దాంతో 3,000 మందికి పైగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వచ్చారని ఒక భారతీయుడు పంజాబీలో చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఉద్యోగాల కోసం…
కెనడాలోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ ఆలయ గోడలపై గుర్తు తెలియని దుండగులు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెనడాలోని భారత హైకమిషన్ ఈ సంఘటనను ఖండించింది.