కరోనా మహమ్మారి దెబ్బకు ఐటీ కార్యాలయాలన్నీ వర్క్ ఫ్రం హోం బాట పట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కరోనా అదుపులో ఉన్న నేపథ్యంలో కార్యాలయాలకు వచ్చి పని చేయాలని ఉద్యోగులకు కంపెనీలు సూచిస్తున్నాయి. అయితే.. ఊహించని విధంగా ఉద్యోగుల కార్యాలయాలకు రమ్మంటే.. ఏకంగా రాజీనామాల పెడుతున్నారు. కొన్ని కొన్ని కంపెనీల వర్క్ ఫ్రం హోం కే ఓటేసి.. లైఫ్ టైం వర్క్ ఫ్రం హోంకు తెరలేపాయి. అయితే.. వర్క్ ఫ్రం హోం సత్ఫలితాలను ఇస్తుందా? కార్యాలయంలో పనిచేసినప్పటిలానే ఉత్పాదకత వస్తోందా? అన్న ప్రశ్నకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు.
వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల దృష్టి మరలుతుందని జాన్సన్ వ్యాఖ్యానించారు. పని మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తామని, ఆ తర్వాత మళ్లీ స్నాక్స్ తెచ్చుకోవడానికి అలా నడుచుకుంటూ రిఫ్రిజిరేటర్ వద్దకు వెళ్తామని, తిరిగి నిదానంగా వస్తూ ల్యాప్‌టాప్ వద్దకు వచ్చేసరికి చేస్తున్న పనేంటో కూడా మర్చిపోతామని బోరిస్ అన్నారు. కాబట్టే మళ్లీ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉందనన్న బోరిస్ జాన్సన్.. తన మాటలు చాలా మందికి నచ్చకపోవచ్చని, మన చుట్టూ ఇతర ఉద్యోగులు కూడా ఉన్నప్పుడు మన నుంచి మరింత ప్రొడక్టివిటీ వస్తుందన్నారు. అంతేకాదు, మరింత ఉత్సాహం, కొత్తకొత్త ఐడియాలతో పనిచేస్తామని తాను విశ్వసిస్తానని వివరించారు బోరిస్ జాన్సన్.