Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ భూమికి తీసుకువచ్చే రెస్క్యూ మిషన్ మరోసారి వాయిదా పడింది. గతేడాది జూన్ 5న ఫ్లోరిడా నుంచి బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఆమె ‘‘అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)’’ వెళ్లారు. అయితే, స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో సమస్యలు ఏర్పడటం, థ్రస్టర్లు విఫలమవ్వడంతో ఆమె అక్కడే ఉండిపోయారు. సునీతా విలియమ్స్‌తో పాటు బుల్ విల్మోర్ కూడా అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
Sunita Williams: నాసా శాస్త్రవేత్తలు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ని అంతరిక్షం నుంచి భూమి మీదకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ మిషన్‌ని నాసా ప్రారంభించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 28 నుంచే ఈ మిషన్ ప్రారంభమైంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇద్దరు అక్కడ నుంచే ఓటేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నిజానికి ఇలా ఓటు హక్కుని వినియోగించే అవకాశం ఉందా..? అంటే ఔననే సమాధానం వస్తుంది. వ్యోమగాములు 1997 నుంచి అంతరిక్షం నంచి ఓటేస్తున్నారు. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. 1997లో టెక్సాస్ శాసనసభకు నాసా ఉద్యోగులు అంతరిక్షం నుంచి ఓటు వేయడానికి అనుమతించే బిల్లుని ఆమోదించారు. అప్పటి నుంచి అంతరిక్షం…
Boeing Starliner: ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసిపోయింది. వ్యోమగాములను తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమనౌకకు పలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది. దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్ కిందకు రావాల్సి వచ్చింది.
Boeing Starliner: బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు నాసాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్టార్‌లైనర్‌లో జూన్ 5న 8 రోజుల అంతరిక్ష ప్రయోగంలో భాగంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లారు. అయితే, స్టార్ లైనర్ క్యాప్సూల్ అంతరిక్షానికి చేరగానే వరసగా దాంట్లో అంతరాయాలు మొదలయ్యాయి.
NASA: బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా ఇటీవల సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. అయితే, అనూహ్యంగా స్టార్‌లైనర్‌లో లీకులు ఏర్పడటంతో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే చిక్కుకుపోయారు. ఆమె వచ్చే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఆమె అంతరిక్షంలోనే మరో ఆరు నెలల పాటు ఉంటుందని ఇటీవల నాసా ప్రకటించింది.