Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తు ముగిసింది. తమ విచారణలో కీలక విషయాలను ఛార్జిషీట్‌లో పొందపర్చింది. దానిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన నుంచి దాన్ని అమలు చేయడం వరకు జరిగిన నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ భాగస్వామిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. సీబీఐ చేసిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది.
Read Also: Haryana Assembly Elections: హర్యానా కాంగ్రెస్లో తిరుగుబాటు.. గుడ్ బై చెప్పిన సీనియ్ నేత..!
ఇక, ఎక్సైజ్ పాలసీ నేరపూరిత కుట్రలో కేజ్రీవాల్ కీలక సూత్రధారిగా వ్యవహరించారు.. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి దాన్ని అమలుచేయడం వరకు ఢిల్లీ సీఎం ప్రమేయం ఉంది.. ఆ మద్యం విధానం వల్ల తమ పార్టీకి ప్రయోజనం చేకూరాలని అతడు డిమాండ్ చేశాడని సీబీఐ పొందుపర్చిన ఛార్జ్ షీట్ లో పేర్కొనింది. అందుకోసం అతని సన్నిహిత సహచరుడు, ఆప్ మీడియా అండ్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి విజయ్ నాయర్ ఈ వ్యాపారంలో వివిధ వాటాదారులను సంప్రదించినట్లు తెలిపింది. అలాగే, చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొంది.
Read Also: టాప్ సీక్రెట్.. బార్ లో సాల్ట్ పల్లీలు ఎందుకు సర్వ్ చేస్తారో తెలుసా..?
అయితే, ఈ కుంభకోణం ద్వారా వచ్చిన డబ్బున్ని.. హవాలా మార్గంలో తరలించారు. మరో ఇద్దరు నిందితులు వినోద్ చౌహాన్, ఆశిశ్ మాథుర్ ద్వారా అక్రమంగా గోవాకు పంపించారనే విషయం దర్యాప్తులో తేలిందని సీబీఐ చెప్పుకొచ్చింది. కేజ్రీవాల్ ఆదేశాల మేరకు గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ధనాన్ని ఆప్ వాడుకుందుని చెప్పుకొచ్చింది. ఈ నేరపూరిత కుట్ర కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని సీబీఐ ఆరోపణలు చేసింది. ఇక, సీబీఐ చేసిన వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది.
Read Also: CM Revanth Reddy: ఖైరతాబాద్ మహాగణపతికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ..
అలాగే, మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సీబీఐ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. దీనిపై న్యాయస్థానం సెప్టెంబరు 10వ తేదీన తీర్పు వెల్లడించనుంది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైల్లోనే ఉండబోతున్నారు.