Gold Smuggling: దీపావళి పండుగ సీజన్‌లో బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెరగడం, ఆకాశాన్నంటుతున్న ధరల కారణంగా వీటి అక్రమ రవాణా కూడా పెరుగుతోంది. శనివారం జైపూర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి పురీషనాళం నుంచి సుమారు కిలోకు పైగా బరువున్న బంగారు ముక్కలను బయటకు తీశారు. వాటి ధర రూ.90 లక్షలకు పైగా ఉంటుందని చెబుతున్నారు. జైపూర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ప్రయాణికుడు అబుదాబి నుండి జైపూర్ విమానాశ్రయంలో దిగాడు.…
Bomb Threat : ఒకదాని తర్వాత ఒకటిగా ఆరు విమానాలకు బెదిరింపులు రావడంతో గత 24 గంటల్లో దేశంలో కలకలం రేగుతోంది. బెదిరింపులకు గురైన ఆరు విమానాలు వేర్వేరు విమానాశ్రయాలు, వేర్వేరు మార్గాల్లో ఉన్నాయి.
జైపూర్ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్క్రీనింగ్‌పై దగ్గర జరిగిన గొడవలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను చెప్పుతో కొట్టినందుకు స్పైస్‌జెట్ ఉద్యోగిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
Indigo : విమానం గాలిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అల్లకల్లోలం అవుతుంది. విమానంలో కుదుపులు సాధారణ విషయం అయినప్పటికీ కొన్నిసార్లు ఇదే చాలా భయానకంగా మారుతుంది.
దేశ వ్యాప్తంగా పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు విమానాశ్రాయాల దగ్గర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు.
దేశంలోని పలు ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ రావడంతో కలకలం రేగింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, చండీఘడ్, జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఈమెయిల్ రావడంతో ఆయా రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. అధికారిక కస్టమర్ కేర్ ఐడీకి ఇమెయిల్ రావడంతో అన్ని విమానాశ్రయంలో కలకలం రేగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. స్థానిక పోలీసుల సహాయంతో విమానాశ్రయంతో పాటు అక్కడ ల్యాండింగ్ చేసే…
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం రాజస్థాన్‌లో ఆమెకు స్వాగతం పలికేందుకు జైపూర్ విమానాశ్రయానికి తరలివచ్చిన స్థానిక కళాకారులతో ముచ్చటించారు. రాజస్థానీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు.