Sunil’s Grand Entry to Malayalam Industry with turbo movie: తెలుగు ప్రేక్షకులకు సునీల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ హీరోగా మారారు. హీరో అనిపించుకోవడం కోసం సిక్స్ ప్యాక్ చేసి అలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత సినిమాలు కరువవడంతో మళ్లీ కమెడియన్ క్యారెక్టర్ల వైపు తిరిగి చూసి ఒకటిరెండు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు సైతం చేశారు. ఇక సునీల్ యాక్టింగ్ జర్నీలో పుష్ప సినిమా ఒక పెద్ద ఊపు తీసుకు వచ్చింది. సునీల్ గెటప్ నుంచి యాక్టింగ్ వరకు ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో నిరూపించుకున్నాడు. ఇక ఆ సినిమాలో సునీల్ విలనిజం చూసిన తమిళ, మలయాళ దర్శక రచయితలు సునీల్ వెంట పరుగులు తీస్తూ తమ సినిమాలలో సైతం సునీల్ కోసం ప్రత్యేకంగా కొత్త కొత్త క్యారెక్టర్లు డిజైన్ చేయిస్తున్నారు అక్కడి హీరోలు, దర్శకులు. సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన భారీ బ్లాక్ బస్టర్ సినిమా ‘జైలర్’లో సునీల్ క్యారెక్టర్ ప్రేక్షకులు అందరినీ ఎంటర్టైన్ చేయగా ఆ తరువాత మార్క్ ఆంటోనీ, నిన్న రిలీజ్ అయిన జపాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నారు.
Japan – Jigarthanda: జపాన్-జిగర్ తండా సినిమాల మధ్య కామన్ పాయింట్స్ ఇవే
నిజానికి శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘మావీరన్’ (తెలుగులో మహావీరుడు పేరుతో విడుదల అయింది) సినిమాతో తమిళ చలన చిత్ర పరిశ్రమకు సునీల్ పరిచయం అయ్యారు. ఆ సినిమాలో చేసింది చిన్న పాత్రనే అయినా ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమకు సునీల్ పరిచయం అవుతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘టర్బో’ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు శుక్రవారం వెల్లడించారు. వైశాఖ దర్శకత్వం వహిస్తున్న ‘టర్బో’ సినిమాపై మలయాళ పరిశ్రమలో ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. వాటికి తోడు మమ్ముట్టి సినిమా కావడంతో సునీల్ మాలీవుడ్ ఎంట్రీ ఒక రేంజ్ అని అంటున్నారు. నిజానికి మలయాళ సినిమాల్లో తెలుగు నటులకు ఆఫర్లు రావడం చాలా తక్కువ. ఒకరిద్దరికి ఆ అవకాశాలు వచ్చినా అవి అంత ప్రాముఖ్యత ఉన్నవి అయితే కాదు. కానీ ఇప్పుడు సునీల్ ఇంత మంచి అవకాశం వెతుక్కుంటూ రావడం మామూలు విషయం కాదు. ఇది పుష్ప ఎఫెక్ట్ వల్లనే వచ్చి ఉండచ్చు కానీ సునీల్ మలయాళ నక్కతోక తొక్కాడురా అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.