పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్-లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ పరిస్థితులు కమ్ముకున్నాయి. ఇటీవల హమాస్ అగ్ర నేత హనియా హత్య తర్వాత ఈ పరిస్థితులు మరింత తీవ్రం అయ్యాయి. అయితే హనియా హత్యపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే లెబనాన్‌కు చెందిన ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. దీంతో ఇజ్రాయెల్‌పై ఇరాన్ రగిలిపోతుంది. భారీగా దాడులకు పాల్పడాలని ఇరాన్ పూనుకుంది. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఇరాన్‌కు కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పట్ల సంయమనం పాటించాలని ఇరాన్‌కు పుతిన్ సూచించినట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని కోరినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పౌరులకు ఎలాంటి ప్రాణనష్టం జరిగించొద్దని పుతిన్ తెలిపినట్లు సమాచారం. రష్యాలో తయారు చేసిన సుఖోయ్ సు-35 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయాలని ఇరాన్ కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఈ సూచన చేసినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Bangladesh Violence: ‘‘అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు’’.. షేక్ హసీనా ప్రత్యర్థి ఖలిదా జియా తొలి సందేశం..
ఇటీవల పుతిన్ సహాయకుడు సెర్గీ షోయిగు ఇరాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఖమేనీని కోరినట్లు తెలుస్తోంది. అనుమానిత హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్ విషయంలో సంయమనంతో ఉండాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని కోరినట్లు ఇద్దరు సీనియర్ ఇరాన్ వర్గాలు తెలిపాయి. టెహ్రాన్‌లో జరిగిన రహస్య సమావేశంలో సుఖోయ్ సు-35 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు మాస్కోపై ఒత్తిడి వచ్చిందని రాయిటర్స్ వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌తో రష్యా సన్నిహిత సంబంధాలు పెరిగాయి. టెహ్రాన్‌తో విస్తృత సహకార ఒప్పందంపై సంతకం చేయడానికి రష్యా సిద్ధమవుతున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: UP crocodile Video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ మొసలి.. జనాలు పరుగులు
ఇటీవల లెబనాన్, ఇరాన్‌లో జరిగిన హత్యలకు బాధ్యులమని ఇజ్రాయెల్ అధికారులు ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇజ్రాయెల్‌తో యుద్ధం చేస్తున్న హమాస్‌కు ఇరాన్ మద్దతు ఇచ్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి గాజా వివాదం చెలరేగింది. హమాస్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై కాల్పులు జరుపుతున్న హిజ్బుల్లాకు కూడా ఇరాన్ మద్దతు ఇచ్చింది. ఇలా మూడు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉంటే ఇరాన్‌లోనే హమాస్ అగ్ర నేత హనియా హత్యకు గురి కావడం విశేషం.
ఇది కూడా చదవండి: Shine Tom Chacko: దసరా విలన్ బ్రేకప్.. నిద్ర పట్టట్లేదంటున్న మాజీ ప్రియురాలు