Shine Tom Chacko Breakup With Thanooja: దసరా విలన్ షైన్ టామ్ చాకో తన ప్రేయసి, మోడల్ తనూజ నుంచి ఇటీవల విడిపోయారు. వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత విడిపోయారు. బ్రేకప్ గురించి షైన్, తనూజ చెప్పిన విషయాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. షైన్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ అమ్మాయి కావాలని కోరుకోలేదని, అది దానంతట అదే జరుగుతుందని చెప్పాడు. “అవును, నేను మళ్ళీ ఒంటరిగా ఉన్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ స్త్రీని కోరుకోలేదు, నాకు ప్రేమపై కూడా ఆసక్తి లేదు. కానీ నేను పదే పదే అటు వైపే వెళ్తాను, అది మానసికంగా జరిగిపోతూ ఉండవచ్చు అని అన్నాడు. ఇక నటుడు షైన్ టామ్ చాకోతో విడిపోయిన తర్వాత తన జీవితాన్ని వివరిస్తూ “ఈ రోజుల్లో నాకు నిద్ర రావడం లేదు” అని తనూజ చెప్పింది.
Anupama: అనుపమ పరమేశ్వరన్ క్రేజ్.. పడిపోయిన వృద్ధురాలు
“నేను నిద్రకు ఉపక్రమించినప్పుడల్లా, నా బ్రేకప్ తర్వాత నా కుటుంబ సభ్యులను ఎదుర్కోవడం గురించి ఆలోచనలు నా మనస్సులోకి వస్తాయి. అప్పుడప్పుడు అమ్మ ఫోన్ చేసి ఓదార్పునిస్తుంది. ఆమె నా ప్రాణ స్నేహితురాలు. ఒక నెలకు పైగా, నేను షైన్‌ని లేదా అతని కుటుంబాన్ని సంప్రదించలేదు. కానీ అతను నా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తాడు, నన్ను చెక్ చేస్తున్నాడు. మా సమస్యలు ప్రైవేట్. వాటిలోకి ఇతరుల చొరబాటు అవసరం లేదు. ఎక్కువ మంది దాని గురించి మాట్లాడటం మరింత ఇబ్బంది పెడుతోంది. అతను మంచి మనిషి, నేను అతనిని చాలా మిస్ అవుతున్నాను. కొన్నిసార్లు నేను అతని ప్రొఫైల్‌లోకి వెళ్తాను, అతను ఎలా ఉన్నాడో చూడటానికి. అతను నన్ను కూడా మిస్ అవుతున్నాడని నాకు తెలుసు. మనమందరం ఈ జీవితంలో ఒంటరిగా ఉన్నాము ఒకోసారి మన స్నేహితుల చేతుల్లో కూడా మోసపోతాము. ఇప్పుడు, నేను నా మోడలింగ్ వృత్తిని, నా చదువును ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను అని ఆమె పేర్కొంది.