భారతదేశం అంటే సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక భారతీయ వంటకాలకు పేరు పెట్టక్కర్లేదు. ఆ సువాసనకే ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు. అంతటి కమ్మదనం, రుచి ఉంటాయి. వంటకాలు చూస్తేనే నోరూరిపోతుంది. అంతగా ఇండియన్ ఫుడ్స్ ఫేమస్. అలాంటిది భారతీయ వంటకాలపై ఒక ఆస్ట్రేలియన్ యూట్యూబర్ నోరుపారేసుకుంది.
ఇది కూడా చదవండి: Parrot Surgery: చిలుకకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన పశు వైద్యులు..
సోషల్ మీడియాలో భారతీయ మసాలా దినుసులపై ఆస్ట్రేలియన్ యూట్యూబర్ సిడ్నీ వాట్సన్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ వంటకాలను ‘డర్ట్’ అంటూ సోషల్ మీడియాలో సంభోదించింది. ఈ పదం భారతీయులకు కోపం తెప్పింది. సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె చేసిన ఫాలోఅప్ వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. ‘‘మీ ఆహారం రుచికరంగా ఉండాలంటే దాని మీద మురికి మసాలాలు వేయవలసి వస్తే, మీ ఆహారం మంచిది కాదు.’’ అంటూ ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు భారతీయ నెటిజన్లకు మరింత కోపం తెప్పించింది.
ఇది కూడా చదవండి: Balineni Srinivasa Reddy: అక్కడే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా-బాలినేని
ఇదిలా ఉంటే ఈ ఏడాది టేస్ట్ అట్లాస్‌లో ప్రతిష్టాత్మకమైన ‘‘100 బెస్ట్ డిషెస్ ఇన్ ది వరల్డ్’’ జాబితాలో నాలుగు భారతీయ వంటకాలు ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేశాయి. ఇంత ప్రాముఖ్యతను సంపాదించిన భారతీయ వంటకాలను తక్కువ చేసి మాట్లాడడంపై యూట్యూబర్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Lebanon: లెబనాన్‌లో మళ్లీ ప్రకంపనలు.. ఒక్కసారిగా పేలిన వాకీటాకీలు, మొబైల్స్
It really, really isn't. https://t.co/jzoiUW60bl
— Dr. Sydney Watson (@SydneyLWatson) September 16, 2024
yep.
It all tastes like burning. People who like this are masochistic.— Dr. Sydney Watson (@SydneyLWatson) September 16, 2024