Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడికి తెగబడింది. ఖార్కివ్ తూర్పు ప్రాంతంలోని సూపర్ మార్కెట్‌పై దాడి చేసింది. ఈ దాడిలో ప్రజలు పెద్ద ఎత్తున మరణించినతట్లు ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా జరిపిన ఈ రాకెట్ దాడిలో ఇప్పటి వరకు 49 మంది ప్రజలు మరణించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలన్ స్కీ తెలిపారు.