iPhone 18 Pro అడిగిన భార్య.. బంగారం అమ్మి మరీ కొనిచ్చిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 Pro: యాపిల్ ఫోన్లపై ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.. ఐఫోన్ కొత్త సిరీస్ వచ్చిందంటే చాలు.. ఐఫోన్ మీద ఉన్న పిచ్చితో వెంటనే కొనుగోలు చేయాల్సిందే అనే వరకు వెళ్లింది పరిస్థితి.. కొందరైతే.. ఐఫోన్ కోసం ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు లేకపోలేదట.. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. భార్య కోసం ఇంట్లో ఉన్న బంగరం అమ్మి మరీ ఐఫోన్ 18 ఫ్రో ఫోన్ కొన్నాడో భర్త.. కాగా, యాపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ అధికారిక అమ్మకాలు ప్రారంభమైన వెంటనే భారీ స్పందన కనిపించింది. కొత్త ఐఫోన్లను సొంతం చేసుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు ఆసక్తి చూపుతున్నారు. నోయిడాలోని డీఎల్ఎఫ్ మాల్లో ఉన్న యాపిల్ స్టోర్ వద్ద కూడా తెల్లవారుజాము నుంచే వినియోగదారులు భారీగా క్యూ కట్టారు. కొందరు తమ కోసం కొత్త ఐఫోన్ కొనుగోలు చేయగా.. మరికొందరు తమ భార్యలు, కాబోయే భార్యల కోసం ఫోన్లు కొనుగోలు చేసేందుకు వచ్చారు.
కొత్త ఐఫోన్ కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు నోయిడాలోని యాపిల్ స్టోర్‌ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి చెప్పిన విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. తన భార్య ఐఫోన్ 18 ప్రో కావాలని అడగడంతో, ఆమెకు బహుమతిగా ఇవ్వడానికి ఇంట్లోని బంగారాన్ని విక్రయించినట్లు ఆయన వెల్లడించారు. యాపిల్ స్టోర్ ఉదయం 8 గంటలకు తెరవాల్సి ఉండగా.. అంతకుముందే డీఎల్ఎఫ్ మాల్ బయట భారీ క్యూ ఏర్పడింది. ఆ క్యూలో ఉన్న ఢిల్లీ వ్యక్తిని మీడియా ప్రశ్నించగా.. తన భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనడానికి వచ్చానని చెప్పారు. తన భార్య ఇప్పటివరకు ఐఫోన్ ఉపయోగించలేదని, అందుకే ఆమెకు ఐఫోన్‌తో కొత్త అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. భార్య ఐఫోన్ 18 ప్రో కొనివ్వాలని కోరడంతో, ఎలాగైనా ఆమె కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
Also Read
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
- Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
- Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ఐఫోన్‌ను అదే రోజు ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించగా.. “ఈ రోజు నా దగ్గర డబ్బు ఉంది, ఇంతకు ముందు లేదు. భవిష్యత్తులో ఉంటుందో లేదో తెలియదు. నేను ఈ రోజుతో జీవిస్తున్నాను” అని ఆయన సమాధానం ఇచ్చారు. కొత్త ఐఫోన్ కొనుగోలు కోసం తన బంగారాన్ని అమ్ముకున్నానని కూడా వెల్లడించారు. ఈ ఘటన కొత్త ఐఫోన్‌పై వినియోగదారుల్లో ఉన్న ఆసక్తి, క్రేజ్‌ను మరోసారి చూపించింది. భార్య కోరిక తీర్చేందుకు బంగారం విక్రయించి మరీ ఐఫోన్ కొనుగోలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాబోయే భార్య కోసం మరొకరు..!
మరోవైపు.. పంజాబ్ నుంచి నోయిడాకు వచ్చిన గుర్దితా సింగ్, తన స్నేహితుడితో కలిసి కొత్త ఐఫోన్ కొనుగోలు చేసేందుకు ఆపిల్ స్టోర్‌కు వచ్చారు. ఆమె స్నేహితుడు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపాడు. తన కాబోయే భార్యకు ఐఫోన్ 18 ప్రోను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఆయన ఉదయం 6 గంటల నుంచే స్టోర్ బయట వేచి ఉన్నట్లు తెలిపారు. తన కాబోయే భార్యకు బహుమతిగా ఇవ్వడానికి సుమారు రూ.3.5 లక్షలు ఖర్చు చేసి ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేసినట్లు గుర్దితా సింగ్ వెల్లడించారు. రెండు ఫోన్లు కొనుగోలు చేసిన అనంతరం వారు తిరిగి పంజాబ్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఐఫోన్ 18 ప్రో సిరీస్ అమ్మకాలు ప్రారంభమైన తొలిరోజే కనిపించిన ఈ ఘటనలు.. కొత్త ఐఫోన్ కోసం వినియోగదారులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అద్దం పడుతున్నాయి..
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?