Israel: తెగిన తలను అతికించారు.. ఇజ్రాయెల్ వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటారు. అది ఇజ్రాయిల్‌లోని ఒక బాలుని విషయంలో నిజమైంది. కారు ప్రమాదంలో తెగిన తలను అతికించి.. బ్రతకడు అనుకున్న 12 ఏళ్ల బాలున్ని వైద్యులు అత్యంత కఠినతరమైన ఆపరేషన్‌ను చేసి.. బ్రతికించారు. ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. వైద్యశాస్త్ర చరిత్రలో ఇదో అరుదైన ఘటన అని.. అసాధ్యమని భావిస్తున్న ఓ చికిత్సా విధానాన్ని ఇజ్రాయెల్ వైద్యులు తమ హస్తవాసి ద్వారా సుసాధ్యం చేసి చూపించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృత్యు ఒడికి చేరువలో ఉన్న ఓ చిన్నారికి…ఆధునిక సాంకేతికతకు తమ నైపుణ్యాన్ని మేళవించి పునర్జన్మ ప్రసాదించారు. శరీరం నుంచి అంతర్గతంగా విడిపోయిన శిరస్సును అతికించి ప్రాణాలు కాపాడారు.
Read also: Amanchi Srinivasa Rao: జనసేనలోకి ఆమంచి సోదరుడు.. నేడు పవన్ సమక్షంలో చేరిక
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
జోర్డాన్ వ్యాలీకి చెందిన పన్నెండేళ్ల సులేమాన్ హసన్‌కు సైకిల్ రైడ్ ఎంతో ఇష్టం. రోజూ పాఠశాల నుంచి ఇంటికి రాగానే తప్పనిసరిగా తన సైకిల్‌పై వ్యాలీలోని రోడ్లపై చక్కర్లు కొట్టాల్సిందే. బిజీగా ఉండే ఆ రహదారులపై జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులు అతడిని తరచూ హెచ్చరించేవారు. ఓ రోజు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిన హసన్‌ను కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతనిని ఆస్పత్రికి తరలించారు. హసన్ కేసును జెరూసలేంలోని హదస్సా ఈన్ కెరెమ్ ఆస్పత్రి వైద్యులు ఓ సవాలుగా స్వీకరించారు. ప్రమాదంలో హసన్ మెడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. దాంతో పాటు పొత్తి కడుపులో బలమైన గాయమైనట్లు గుర్తించారు. తల, శరీరం దాదాపు ఒకదాన్నుంచి మరోటి వేరైన స్థితిలో హసన్‌ను తీసుకొచ్చినట్లు ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జన్ డా.ఓహాద్ ఈనావ్ తెలిపారు. శిరస్సుతో వెన్నెముక చివరి అంచును కలిపి ఉంచే భాగం దాదాపు విడిపోయింది. ‘‘మేమంతా హసన్ పరిస్థితి చూసి నివ్వెరపోయాం. తల, మెడ కలిసే చోటులోని లిగ్మెంట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వెంటనే సమీక్ష నిర్వహించి ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం. శస్త్రచికిత్స ద్వారా హసన్ తల, వెన్నెముకను తిరిగి కలిపాం. ఇది ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఆస్పత్రిలోని అన్ని విభాగాల స్పెషలిస్ట్ వైద్యులు కొన్ని గంటలపాటు శ్రమించారు. ఆపరేషన్ సమయంలో వైద్యుల సాంకేతిక అనుభవం ఎంతగానో ఉపయోగపడింది. ప్రమాదం జరిగిన వెంటనే ట్రామా సిబ్బంది సత్వరం స్పందించి ప్రాథమిక చికిత్స అందించడం నుంచి.. ఆపరేషన్ చేయడం వరకూ ప్రతి నిర్ణయం హసన్ ప్రాణాల్ని నిలబెట్టేందుకు తోడ్పడింది. మా ప్రయత్నం వృథా కాలేదు. ఆపరేషన్ విజయవంతమైంది’’ అని డా.ఓహాద్ ఈనావ్ తెలిపారు.
Read also: Bombay High Court: కొత్త ఐటీ చట్టాలపై బాంబే హైకోర్టు సీరియస్.. విపరీతంగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు
హసన్‌కు గత నెలలో శస్త్రచికిత్స చేయగా.. ప్రస్తుతం పరిస్థితి మెరుగవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆపరేషన్ తర్వాత నెలరోజుల పాటు హసన్‌ను ఆస్పత్రిలో వైద్యులు, నర్సులు అనుక్షణం గమనిస్తూ కంటికి రెప్పలా కాపాడారు. బతకడనుకున్న తమ కుమారుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులకు చెమ్మ గిల్లిన కళ్లతో హసన్ తండ్రి ధన్యవాదాలు చెప్పారు. ‘‘మా ఒక్కగానొక్క బిడ్డను తిరిగి ప్రాణాలతో తమకు అప్పగించిన వైద్యులకు నేను జీవితాంతం రుణపడి ఉంటా…. ప్రమాదం జరిగిన తర్వాత బతికే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ.. అపార అనుభవం కలిగిన వైద్య సిబ్బంది, సాంకేతికత, సత్వర నిర్ణయం, ట్రామా, ఆర్థోపెడిక్ బృందాలే మా అబ్బాయిని కాపాడాయని.. అందదుకు తాను వారికి పెద్ద థ్యాంక్స్ చెప్పడం మినహా ఏమీ చేయలేనని హసన్ తండ్రి చెమ్మగిల్లిన కళ్లతో చెప్పారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!