Gold Rates: గత కొన్ని రోజులుగా అమాంతం పెరుగుతున్న బంగారం ధరలకు గత రెండు రోజుల నుండి కాస్త ఉపశమనం లభించింది. ప్రపంచ మార్కెట్లో ఒడిదుడుకులను, వివిధ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న కారణంగా బంగారు ధరలు అమాంతం పెరిగాయి. వీటితో పాటు ట్రంప్ చేసిన వాణిజ్య పన్నుల విషయం కూడా ఈ ధరలు ప్రధాన కారణం. శుక్రవారం నాడు తులం బంగారం 1360 రూపాయలు తగ్గి ట్రేడ్ అయ్యింది. ఇకపోతే, తాజాగా బంగారం ధర మరింత క్షిణించింది. తాజాగా 10 గ్రాములకు 550 రూపాయలు తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి కాస్త ఉపశమనం లభించింది. ఇకపోతే నేడు బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి.
Monsoon Season: వర్షాకాలంలో తీసుకోవల్సిన జాగ్రత్తలివే!
నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 550 రూపాయలు తగ్గి, ప్రస్తుతం తులం బంగారం ధర రూ.99,930 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 500 రూపాయిలు తగ్గి తులం బంగారం ధర రూ. 91,600 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 410 రూపాయిలు తగ్గి 10 గ్రాముల ధర రూ.74,950 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా.. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్ లో కేజీ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండిపై ఏకంగా రూ.2,000 తగ్గి రూ.1,26,000 వద్ద ట్రేడ్ అవుతుంది. ప్రాంతాల వారీగా నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉంటాయి.
UPI Payments: ఉచిత UPI సేవలకు ఇక చరమగీతం..? భవిష్యత్లో డిజిటల్ చెల్లింపులకు రుసుము తప్పదా?