September 21: నిజంగా సెప్టెంబర్ నెల ఆకాశంలో అద్భుత దృశ్యాలకు నిలయంగా మారింది. 2025 సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం కూడా సెప్టెంబర్ నెలలోనే రానుంది. ఇటీవల చంద్రగహణం కూడా ఇదే నెలలో వచ్చింది. తాజాగా రానున్న సూర్యగ్రహణం చాలా స్పెషల్ అని చెబుతున్నారు. ఈ ఏడాదిపాక్షిక సూర్యగ్రహణం రాబోతుందని జ్యోతిష్యులు పేర్కొన్నారు. ఇంతకీ ఈ సూర్యగ్రహణం ప్రత్యేకతలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Chitti Scam: కిలాడీ జంట.. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు పంగనామం!
గ్రహణం రోజు సమానంగా పగలు, రాత్రి..
ఈ సూర్యగ్రహణం ఒక నిర్దిష్ట కారణంతో చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం శరదృతువు విషువత్తుకు ఒక రోజు ముందు ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయని, అందుకే ఈ సూర్యగ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా పేర్కొంటున్నారు. ఈ సూర్యగ్రహణం సమయంలో పూర్తిగా చీకటి ఏర్పడదని, అయితే సూర్యుడు చంద్రవంక ఆకారంలో కనిపిస్తాడు పేర్కొన్నారు. ఈ గ్రహణం భారత దేశ సమయం ప్రకారం.. సూర్యోదయం సమయంలో ఏర్పడనుంది. అప్పుడు నెలవంక ఆకారంలో సూర్యుడు కనిపిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే.. గ్రహణం, సూర్యోదయం రెండు కూడా ఒకేసారి రాబోతున్నాయి. ఇది చాలా అరుదుగా ఏర్పడే సందర్భం అని అంటున్నారు.
సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది..
సెప్టెంబర్ 21వ ఆదివారం రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం.. ఈ గ్రహణం దాదాపు రాత్రి 10:59 నుంచి తెల్లవారుజామున 3:23 (సెప్టెంబర్ 22) వరకు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంటే గ్రహణం అర్ధరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా.. న్యూజిలాండ్‌లోని సౌత్ ఐలాండ్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తుందని సమచారం. ఇక్కడ సూర్యునిలో 86% చంద్రుడితో కప్పబడి ఉంటాడని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. స్టీవర్ట్ ద్వీపం, క్రైస్ట్‌చర్చ్‌కి చెందిన ప్రజలు సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. అలాగే అంటార్కిటికాలోని రాస్ సీ కోస్ట్, యంగ్ ఐలాండ్ వంటి దీవుల నుంచి కూడా గ్రహణం కనిపించనుంది. యూరప్, ఉత్తర అమెరికాలోని ప్రజలు ఈ ప్రత్యేక సూర్యగ్రహణాన్ని చూడలేరు. సెప్టెంబర్ 21న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం దక్షిణ అర్ధగోళంలో మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు.
READ ALSO: India Private Gold Mine: పక్క రాష్ట్రంలో.. దేశంలోనే తొలి ప్రైవేట్ బంగారు గని..