Chitti Scam: జనాల అమాయకత్వమే వారికి పెట్టుబడి. దాన్ని ఆసరాగా చేసుకుని చిట్టీల వ్యాపారం పేరుతో అందిన కాడికి దండుకుని బిచాణా ఎత్తేస్తున్నారు కొంత మంది కేటుగాళ్లు. అలాంటి ఘటనే హైదరాబాద్ శంషాబాద్‌లో జరిగింది. చిట్టీల పేరుతో రూ. 30 కోట్లు కొట్టేశారు దంపతులు. వారి దగ్గర నమ్మి చిట్టీలు వేసిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇలాగే ప్రచారం చేస్తారు కొంత మంది. డబ్బులు తీసుకుంటారు.. చిట్టీలు నడిపిస్తారు. వన్ ఫైన్ మార్నింగ్.. ఆ డబ్బులతో ఉడాయిస్తారు. ఇలాంటి మోసాలు… ఏళ్ల నుంచి ఇలాగే జరుగుతున్నాయి. అయినా జనాలు మానడం లేదు.. అటు చిట్టీలు వేసే వారు కూడా స్టైల్ మార్చడం లేదు.
తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నివాసముండే చిట్టీల వ్యాపారి పోలేమోని సురేందర్ ముదిరాజ్ దంపతులు కూడా ఇలాగే చేశారు. జనాల అమాయకత్వాన్ని పెట్టుబడిగా చేసుకుని కోట్లలో కుచ్చుటోపీ పెట్టి రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేశారు. బాధితులు ఒక్కొక్కరుగా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే బాధితుల్లో కొందరు పోలీసులు కూడా ఉండడం అందరినీ కలవరపాటుకు గురి చేస్తోంది.
Crime News: అప్పు ఇచ్చిన పాపనికి రెండు ప్రాణాలు బలి!
మరోవైపు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు. ఘరానా మోసగాడు సురేందర్ ముదిరాజ్ కోసం వేట సాగిస్తున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మ బస్తీకి చెందిన పోలేమోని సురేందర్ ముదిరాజ్, కవిత దంపతులు గత కొన్నేళ్లుగా శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద నివాసం ఉంటున్నారు. అయితే అందరితో స్నేహాన్ని నటించే అలవాటు ఉన్న సురేందర్ ముదిరాజ్.. స్నేహం ముసుగులో చిట్టీల పేరుతో నయా బిజినెస్‌కు తెర లేపాడు. ఈ మేరకు చిట్టీల పేరుతో స్నేహితులను సభ్యులుగా చేర్చుకొని…. అందిన కాడికి దోచుకోవడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్ పరిధిలో వందలాదిమంది సురేందర్ ముదిరాజ్ మాయ మాటలకు బుట్టలో పడిపోయి లక్షల్లో చిట్టీలు వేశారు. అయితే చిట్టీలు వేసిన చాలామంది సభ్యులకు చిట్టీ టైమ్ దాటి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చాడు.
చిట్టీల సమయం ముగిసినా సభ్యులకు చిట్టీ డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చిన సురేందర్ ముదిరాజ్. చిట్టీల కొనుగోలు పేరుతో మరో మోసానికి పథకం రచించాడు. 4,5 నెలల్లో చిట్టీలు అయిపోతున్నాయి. వాటిని కొనుగోలు చేస్తే మీకు 4,5 నెలల్లో అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపి లక్షల్లో వసూలు చేశాడు. ఫలితం. చిట్టీల నిర్ణీత సమయం దాటినప్పటికీ సభ్యులకు డబ్బులు ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చిన సురేందర్ ముదిరాజ్.. సెప్టెంబర్ 2న చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి ఇంటికి తాళం వేసి భార్యా పిల్లలతో బిచాణా ఎత్తేశాడు. సుమారు 5 నుంచి 6 కోట్ల రూపాయల మేర జనాలకు సురేందర్ ముదిరాజ్ దంపతులు కుచ్చుటోపీ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు ఒక్కొక్కరుగా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు.
Srikalahasti Temple: అప్పట్లో సీఐ చేతిలో చెంపదెబ్బ.. ఇప్పుడు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన నేత..
రెక్కల కష్టంతో.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేస్తే తాము నిండా మునిగి పోయామని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. చిట్టీల పేరుతో కోట్లల్లో డబ్బులు దండుకొని పరారైన పోలేమోని సురేందర్ ముదిరాజ్ దంపతులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసు అధికారులను వేడుకుంటున్నారు.