Rajinikanth Diwali Celebrations: దేశమంత దీపావళి సెలబ్రేషన్స్‌లో మునిగితేలింది. ఆదివారం నార్త్ నుంచి సౌత్ వరకు టపాసుల సౌండ్‌తో మారుమోగింది. ఇక దీపావళికి సినీ సెలబ్రిటీల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్‌లో వారం ముందుగానే పండగ సందడి మొదలైంది. బి-టౌన్ సెలబ్రెటీల దీపావళి వేడుకకు మనీష్ మల్హోత్రా, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖుల ఇల్లు వేదికైంది. ఇక టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి.. మహేష్ బాబు, వెంకటేష్ వంటి స్టార్ హీరోల ఫ్యామిలీని హోస్ట్ చేశారు. పండగ వేళ తెలుగు స్టార్ హీరోలంతా ఒక్కచోట చేరి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌ని రెట్టింపు చేశారు.
Also Read: Akkineni Venkat: ఆస్తి పంపకాలు.. నాగార్జునతో గొడవలు.. అన్న వెంకట్ ఏమన్నాడంటే..?
ఇక తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కుటుంబంతో కలిసి సంతోషంగా దీపావళి జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కాస్తా ఆలస్యంగా బయటకు వచ్చాయి. దీపావళి పర్వదినాన సూపర్ స్టార్ తన ఇద్దరి కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్యలతో పాటు మనవళ్లతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా మాజీ దంపతులు ఐశ్వర్య రజనీకాంత్-ధనుష్ తనయులు యాత్ర, లింగా రజనీ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో రజనీ తన మనవళ్లకు స్పెషల్ గిఫ్ట్ కూడా ప్రజెంట్ చేసినట్టు కనిపించారు. ఇక కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాల్కానీలో క్రాకర్స్ కాలుస్తూ నవ్వుతూ ఆనందంగా గడిపిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. దీంతో పండగ వేళ రజనీ ఇంట్లో కూతుళ్లు, మనవళ్లు చేసిన సందడి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇక దివాళీ రోజు తలైవా తన ఇంటి ముందు అభిమానులను పలకరించారు. ఆయనకు విషెస్ చెప్పేందుకు వచ్చిన అభిమానులను స్వయంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Tiktok Ban in Nepal: భారత్ బాటలోనే నేపాల్.. చైనాకు మరో గట్టి షాక్..