Tiktok Ban in Nepal: చైనా యాప్ టిక్‌టాక్‌కు మరో షాక్ తగిలింది. టిక్ టాక్‌ను తమ దేశంలో నిషేధిస్తున్నట్టు తాజాగా మన పొరుగు దేశం నేపాల్ ప్రకటించింది. ఈ మేరకు నేపాల్ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ సోమవారం తెలిపారు. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే దాని మీద ఇంకా స్పష్టత లేదని ఆమె పేర్కొన్నారు. అయితే సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాతే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ యాప్ వల్ల సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న కారణంతోనే నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ సహా చాలా దేశాలు టిక్‌టాక్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నేపాల్ చేరడం గమనార్హం. ఎందుకంటే నేపాల్, చైనాల మధ్య వ్యూహాత్మక సాన్నిహిత్యం పెరుగుతున్న తరుణంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
Also Read: Mrunal Thakur: సీతా.. లవ్ లో పడ్డావా.. ? అది కూడా అతనితో..
భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పటికీ, సమాజంలోని పెద్ద వర్గంలో ద్వేషపూరిత ప్రసంగాల ధోరణిని టిక్‌టాక్ ప్రోత్సహిస్తోందని నేడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో నేపాల్ ప్రభుత్వం విమర్శించింది. గత నాలుగేళ్లలో నేపాల్‌లో టిక్‌టాక్ కారణంగా 1647 సైబర్ నేరాలు నమోదయ్యాయని, నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్‌టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘సోషల్ నెట్‌వర్కింగ్ ఆపరేషన్‌పై దిశలు 2023’ చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే అమలులోకి వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం.. నేపాల్‌లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు దేశంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. ఫేస్‌బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), టిక్‌టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్‌లు నేపాల్‌లో తమ కాంటాక్ట్ కార్యాలయాలను తప్పనిసరిగా తెరవాలి. ఈ విషయమై గురువారం నేపాల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నేపాల్‌లో కంపెనీల ప్రతినిధులు గైర్హాజరు కావడం వల్ల తమ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం అధికారులకు కష్టమైందనే ఫిర్యాదులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Vijay Devarakonda-Rashmika : మళ్ళీ దొరికిపోయిన విజయ్, రష్మిక.. ఆ ఫొటోతో బుక్కయ్యారు..