కట్టుకున్న భర్తే.. ఆమె పాలిట కాల యముడయ్యాడు. నిత్యం అనుమానిస్తుండడంతో దూరంగా ఉంటున్న ఆమెను నమ్మించి అత్యంత దారుణంగా కడతేర్చాడు. ఈ ఘటన నంద్యాల జిల్లాలో కలకలం సృష్టించింది. భార్య కాపురానికి రాలేదన్న కారణంతో భర్త.. ఆమెను ఇటుకలతో కొట్టి చంపేశాడు. ఇక్కడ చూడండి.. విగత జీవిగా పడి ఉన్న ఈమె పేరు లక్ష్మీ పార్వతి. ఆమె స్వస్థలం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం కృష్ణాపురం. ఈమెకు చింతకుంటకు చెందిన నల్లగట్ల శేషగిరితో వివాహమైంది. వారిద్దరికీ నలుగురు…
మద్యం మత్తులో వంద రూపాయల నోటు ఇవ్వలేదని బిచ్చగాడుని బండరాయితో మోది, దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు.. నంద్యాలలోని నూనెపల్లె ఫ్లై ఓవర్ బ్రిడ్జి దిగువ జరిగిన దస్తగిరి అనే బిచ్చగాడి హత్య కేసు మిస్టరీగా మారగా.. ఆ మిస్టరీని ఛేదించారు త్రీ టౌన్ పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అవుకు మండలం కొండమాయ పల్లెకు చెందిన దస్తగిరికి ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు వున్నారు. వీరితో గొడవ పడి, నంద్యాలకు వచ్చి, రైల్వే స్టేషన్,…
విహారయాత్రకు వచ్చిన ఓ మిత్ర బృందంలోని మిత్రుల మధ్య వేసుకున్న పందెంలో ఓ యువకుడు విగత జీవిగా అనుమానాస్పద రీతిలో ప్రాణం కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) అనే యువకుడు, మరో 9 మందితో స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.. స్నే
దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దుర్మార్గులు నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కొలుములపల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.
నంద్యాల జిల్లాలో పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక బలైంది. నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు..