Woman SI Affair: డ్రైవర్‌తో మహిళా ఎస్సై రాసలీలలు.. కొడుకుతో కలిసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman SI Chitra Killed Her Husband For Extramarital Affair in Tamilnadu: ఆమె ఒక మహిళా ఎస్సై. నలుగురికి రక్షణ కల్పించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉంది. కానీ, కామంతో కళ్లుమూసుకుపోయి ఓ క్షమించరాని నేరం చేసింది. డ్రైవర్‌తో తన రాసలీలలు సాగించేందుకు.. అడ్డుగా ఉన్నాడని భర్తని అంతమొందించింది. ఇందుకు ఓ జ్యోతిష్యురాలి సహకారం తీసుకుంది. మరో విచారకరమైన విషయం ఏమిటంటే.. తల్లి చేసిన నేరానికి కొడుకు కూడా మద్దతు తెలపడం. ఆమె చెప్పినట్టుగానే తలూపుకుంటూ పోయాడు. చివరికి పోలీసులు ఈ కేసుని ఛేధించడంతో, ఇప్పుడు అందరూ జైలు పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కొబ్బరికాయ పగలగొడితే అందులో పువ్వు వస్తే మంచిదేనా?
Also Read
క్రిష్ణగిరి జిల్లా కల్లావి ప్రాంతానికి చెందిన సెందిల్ కుమార్ (48) హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేసేశాడు. అయితే.. అక్రమాలకు పాల్పడటంతో చాలా ఏళ్ల కిందటే ఉద్యోగం కోల్పోయాడు. అప్పటి నుంచి డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి చిత్ర (44) అనే భార్య, జగదీష్‌కుమార్ (19) అనే కొడుకు ఉన్నాడు. భార్య చిత్ర సింగారపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తోంది. కట్ చేస్తే.. గత సెప్టెంబర్ 16వ తేదీన సెందిల్‌కుమార్ ఆకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఎక్కడా అతని జాడ కనిపించలేదు. దీంతో.. అతని తల్లి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. అయితే.. తామే సెందిల్‌కుమార్‌ని హత్య చేశామంటూ ఈనెల 14వ తేదీన అతని కొడుకు జగదీష్‌కుమార్, అతని కారు డ్రైవర్ కమల్‌రాజ్ (37) లొంగిపోయారు. వాళ్లు అలా లొంగిపోవడంపై అనుమానం కలిగిన పోలీసులు.. మరింత లోతుగా విచారించగా, చిత్ర నిజస్వరూపం బయటపడింది.
Mega Star Chiranjeevi: మెగాస్టార్‌కు సోలో హీరోగా చేయడం ఇష్టం లేదా?
చిత్రకు కారు డ్రైవర్ కమల్‌రాజ్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలిసి.. ఆ ఇద్దరినీ నిలదీశాడు. అప్పటినుంచి కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని.. పావకల్ గ్రామానికి చెందిన జ్యోతిష్యురాలు సరోజని సంప్రదించింది. తనకు రూ.10 లక్షలిస్తే.. తన కూలీలతో సెందిల్‌కుమార్ హత్య చేయిస్తానని సరోజ చెప్పింది. అందుకు సరేనన్న చిత్ర, ఆమెకు ఆ మొత్తాన్ని అందజేసింది. పథకం ప్రకారం సెంథిల్‌ని హతమార్చి, శవాన్ని పొదల్లో పడేశారు. సరోజని అదుపులోకి తీసుకున్నాక.. చిత్ర పాత్ర ఉన్నట్లు బయటపడింది. ఈ కేసులో పోలీసులు మొత్తం నలుగుర్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కూలీల కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. పొదల నుంచి సెందిల్ మృతదేహాన్ని వెలికితీసి.. ఆసుపత్రికి తరలించారు.
Twitter Data Leak: చరిత్రలో అతిపెద్ద డేటా లీక్.. అమ్మకానికి 40 కోట్ల మంది వివరాలు
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!