Mega Star Chiranjeevi: మెగాస్టార్‌కు సోలో హీరోగా చేయడం ఇష్టం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కొంతకాలంగా తన ఛరిష్మా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడలేదు. సైరాకు అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చినా యావరేజ్‌గానే నిలిచింది. గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా నష్టాలు తప్పలేదు. దీంతో ఆయన ఇతర హీరోలపై అతిగా ఆధారపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన ప్రతి సినిమాలో మరో హీరోకు చోటు కల్పిస్తున్నాడు. ఖైదీ నంబర్ 150 తర్వాత చిరు నటించిన ప్రతి సినిమాలో మరో పేరున్న హీరో నటించడం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ లాంటి హీరోలు నటించగా.. ఆచార్య సినిమాలో తనయుడు రామ్‌చరణ్‌ను చిరంజీవి తీసుకున్నాడు. గాడ్ ఫాదర్ సినిమాలోనూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను ఇరికించాల్సి వచ్చింది.
Read Also: Andhra Pradesh: వైసీపీలో చేరి తప్పు చేశా.. పరిటాల సునీత కాళ్లపై పడ్డ కార్యకర్త
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలోనూ చిరంజీవి మరో ఇమేజ్ ఉన్న హీరోను తన సినిమాలో తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మాస్ మహరాజా రవితేజ వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీలో రవితేజ పాత్ర నిడివి సుమారు 40 నిమిషాల పాటు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అన్నయ్య సినిమాలో చిరు తమ్ముడిగా నటించిన రవితేజ చాలా కాలం తర్వాత మరోసారి మెగాస్టార్‌తో కలిసి నటిస్తుండటంతో వాల్తేరు వీరయ్యపై అంచనాలు పెరుగుతున్నాయి. అదీకాక రవితేజ ధమాకా చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. దీంతో మెగాస్టార్ మూవీకి రవితేజ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు. మరోవైపు చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ మూవీలోనూ కీర్తి సురేష్ లాంటి క్రౌడ్ పుల్లింగ్ యాక్టర్ నటిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో చిరంజీవికి సినిమాల్లో సోలోగా నటించడం ఇష్టం లేదనే టాక్ నడుస్తోంది.
తాజావార్తలు
-
Hyderabad: ఉప్పల్‌లో మ్యాచ్‌కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్‌ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!