దేవుడికిపూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టడం సంప్రదాయం.

మనసులో ఉన్న కోరికలు తీర్చమని దేవుడికి దండం పెట్టుకొని దేవుడి ముందు కొబ్బరికాయ కొడుతారు. 

ఒకవేళ ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే చాలామంది సంతోషంగా ఫీలవుతారు.

కొబ్బరికాయలో పువ్వు వస్తే మంచిదా. కాదా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది.

కొన్నిసార్లు పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కొడితే అందులోపల పువ్వు వస్తుంది.

అది చిన్న సైజులో ఉన్నా.. పెద్ద సైజులో ఉన్నా పువ్వు వస్తే మాత్రం పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటున్నారు పండితులు. 

దేవుడికి సమర్పించిన కొబ్బరికాయలో పువ్వు రావడం శుభసూచకమట. 

మనసులో దేవుడిని కోరిక కోరికకు దేవుడి నుంచి వచ్చిన రిప్లై అని దాన్ని దైవ ప్రసాదంగా భావించాలని చెప్తున్నారు.