Woman Killed Her Husband In Ghatkesar For Extramarital Affair: వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్ని కూల్చడమే కాదు, మనుషుల చేత హత్యలు కూడా చేయిస్తున్నాయి. కలకాలం కలిసుందామని ప్రతిజ్ఞ చేసిన భార్య/భర్తలే చంపుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇప్పుడు ఒక మహిళ కూడా అదే దారుణానికి ఒడిగట్టింది. పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న ఆమె.. అతనితో కలిసి బతకడం కోసం, అడ్డుగా ఉన్నాడని భర్తని చంపేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Gadwal Love Tragedy: ప్రేమించి మోసం చేసిన ప్రియుడు.. ప్రియురాలు ఏం చేసిందంటే?
వృత్తిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న కొట్టగొల్ల తుక్కప్ప(55) పది సంవత్సరాల క్రితం ఈశ్వరమ్మను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే.. ఏడాది క్రితం ఈశ్మరమ్మకు శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కొన్ని రోజులకే వివాహేతర సంబంధంగా మారింది. కొంతకాలం తుక్కప్పకు తెలియకుండా వీళ్లిద్దరూ రహస్యంగా తమ రాసలీలల్ని కొనసాగించారు. అయితే.. ఒకరోజు తుక్కప్ప వీళ్లిద్దరి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అప్పుడు ఇద్దరినీ తుక్కప్ప మందలించాడు. అయినా వారిద్దరి తీరు మారలేదు. తుక్కప్పకు తెలియకుండా రెగ్యులర్‌గా కలుసుకోవడం స్టార్ట్ చేశారు. కట్ చేస్తే.. కొన్ని రోజుల నుంచి తుక్కప్ప పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధినే అడ్డం పెట్టుకొని, భర్తని అంతం చేయాలని ఈశ్వరమ్మ ప్లాన్ వేసింది.
Strange Incident: తల్లి చనిపోయిందనుకొని కర్మకాండ.. రెండేళ్ల తర్వాత యూట్యూబ్‌లో ప్రత్యక్ష్యం
ప్లాన్‌లో భాగంగా.. ఇటీవల వైద్యం పేరుతో ఈశ్వరమ్మ తన భర్త తుక్కప్పను ఘట్‌కేసర్‌కు తీసుకొచ్చింది. డాక్టర్ దగ్గరకు వెళ్దామని చెప్పిన ఈశ్వరమ్మ.. మార్గమధ్యంలో మద్యం సేవించే అలవాటున్న తుక్కప్ప కోసం వైన్ షాప్‌లో మద్యాన్ని కొనుగోలు చేసింది. అదే సమయంలో ప్రియుడు పురుగుల మందు తీసుకొచ్చాడు. ఈ మందుని మద్యంలో కలిపి, తుక్కప్పకు ఇచ్చింది ఈశ్వరమ్మ. అది తాగిన వెంటనే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే.. అతడు మృతి చెందాడు. పురుగుల మందు వల్లే అతడు చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలగా.. పోలీసులు ఈశ్వరమ్మ, శ్రీనివాస్‌పై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. తుక్కప్ప హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెల్చారు.