పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి.. కొందరు పెళ్లి అయిన తర్వాత కూడా మరో వ్యక్తితో అనైతిక సంబంధాలు కొనసాగిస్తున్నారు.. కొన్ని సార్లు కట్టుకున్న భార్యను భర్తలు కడతేర్చేస్తున్నారు.. చాలా ఘటనల్లో ప్రియుడితో కలిసి మహిళలు.. కట్టుకున్న భర్తనే కాటికి పంపిస్తున్నారు.. అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంది.. కలకాలం కలిసి ఉంటానని శపథం చేసింది.. కానీ, పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. ప్రియుడితో కలసి భర్తను కడ తేర్చిన ఘటన తాజాగా రంగారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించింది..
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం చిల్కమర్రిలో రవితేజ, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం దర్పల్లి గ్రామానికి చెందిన రామస్వామితో అనితకు అక్రమ సంబంధం ఏర్పడింది.. షాద్ నగర్‌లో నివాసం ఉంటూ కోళ్ల ఫామ్‌లో పని చేసేవాడు రామస్వామి.. ఇక, అక్కడే పనిచేసే అనితతో మొదట పరిచయం ఏర్పడగా.. అది కాస్తా వారి ఇద్దరి మధ్య సన్నిహిత్యాన్ని పెంచింది.. క్రమంగా అక్రమ సంబంధానికి దారి తీసింది.. అది ఎంత వరకు వెళ్లిందంటే.. తమ అనైతిక బంధానికి అడ్డుగా ఉన్న భర్తను లేపేసే వరకు వెళ్లింది.. అనిత-రామస్వామి కలిసి ఓ ప్లాన్ చేశారు.. వారి ప్లాన్ ప్రకారం.. ఈ నెల 27వ తేదీన మద్యం (బీర్)లో విషయం కలిపి రవితేజకు ఇచ్చారు.. అందులో విషం ఉన్న విషయం తెలియని రవితేజ.. బీర్ తాగి అస్వస్థతకు గురయ్యాడు.. ఇక, తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా.. తన భర్తను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది అనిత.. పరిస్థితి విషమించడంతో ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లమన్నారు.. ఈ క్రమంలో ఉస్మానియాలో చికిత్స పొందుతూ రవితేజ ప్రాణాలు విడిచాడు.. ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన మృతుడు రవితేజ తండ్రి చెన్నయ్య.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగు చూసింది.. దీంతో, ప్రియురాలు అనిత, ప్రియుడు రామస్వామిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.