Wife Kills Husband With Help From Lover Hides Body In Tank: వివాహేతర సంబంధాల మోజులో పడి కొందరు మహిళలు తమ కాపురాల్ని కూల్చుకుంటున్నారు. అంతటితో ఆగకుండా.. తమను నమ్మిన భర్తల్ని అత్యంత దారుణంగా చంపుతున్నారు. కేవలం ప్రియుడితో రాసలీలలు కొనసాగించడం కోసమే! తాజాగా మరో వివాహిత ఇలాంటి కిరాతకానికే పాల్పడింది. తమ కాపురంలోకి వచ్చిన మూడో వ్యక్తి కోసం.. ఏడడుగులు నడిచి, జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన భర్తని హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని ఓ నీళ్ల ట్యాంకులో కుక్కింది. సభ్యసమాజం తలదించుకునేలా చేసే ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
chapati:చపాతీలు తింటే మంచిది.. రాత్రి చేసినవి పొద్దున తింటే ఇంకా మంచిది
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కి చెందిన సతీష్‌కి కొన్ని సంవత్సరాల క్రితం నీతు అనే మహిళతో వివాహం అయ్యింది. ఈ జంటకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. తన భార్య, కొడుకుతో సతీష్ రెండేళ్ల క్రితం గ్రేటర్ నోయిడాకి వచ్చాడు. సరస్వతి కుంజ్‌లో ఓ ఇంటిని నిర్మిస్తున్నాడు. ఆ ఇంటి నిర్మాణ బాధ్యతల్ని హర్పాల్ అనే మేస్త్రీకి సతీష్ అప్పగించాడు. ఆ హర్పాల్ అనే వ్యక్తితోనే నీతు వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేనప్పుడు.. అతనితో బెడ్‌రూమ్‌లో రాసలీలలు కొనసాగించింది. కొన్నిసార్లు తాను పని నిమిత్తం బయటకు వెళ్తున్నానని చెప్పి.. హర్పాల్ రూమ్‌కి నీతు వెళ్లొచ్చేది. ఒకరికొకరు పీకల్లోతు ప్రేమలో మునిగితేలడంతో.. తాము కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం సతీష్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు.
Hebah Patel : బెడ్‌పై అబ్బా.. అనిపిస్తున్న హెబ్బా పటేల్
ప్లాన్ ప్రకారం.. నీతు, ఆమె ప్రియుడు హర్పాల్ కలిసి ఒక డ్రింక్‌లో మత్తుమందు కలిపి సతీష్‌కి ఇచ్చారు. అది తాగిన తర్వాత సతీష్ స్పృహ కోల్పోయాడు. అప్పుడు వాళ్లు గొంతు కోసి అతడ్ని చంపేశారు. అనంతరం మృతదేహాన్ని పొరుగున నిర్మాణంలో ఉన్న ఇంటికి తరలించారు. అనంతరం సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పాతిపెట్టి, దానికి ప్లాస్టింగ్ చేయించారు. సతీష్ కనిపించకుండాపోవడంతో.. అతని సోదరుడు జనవరి 10వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. భార్య నీతుపై అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించారు. అప్పుడు వివాహేతర సంబంధం కోసం ప్రియుడితో కలిసి చంపానని నీతు నేరం అంగీకరించింది.
Himaja: ఏడనుంచి వస్తున్నాయి రా అన్ని డబ్బులు.. కార్ల మీద కార్లు కొంటున్నారు