Himaja: బుల్లితెర నటులు కూడా స్టార్లకు తగ్గట్టు సంపాదిస్తున్నారు. ఇక యాంకర్లు కానీ, బిగ్ బాస్ లో వచ్చిన కంటెస్టెంట్లు అయితే హీరోయిన్లను మించి పారితోషికాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ షాక్ ఇస్తున్నారు. బిత్తిరి సత్తి దగ్గర నుంచి నిన్న మొన్న వచ్చిన యాదమరాజు వరకు లగ్జరీ కార్లను కొనుగులో చేసి ఆశ్చర్యపరిచారు. ఇక సీరియల్ ద్వారా పరిచయమై.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హిమజ. ఇక బిగ్ బాస్ కు వెళ్లి మరింత ఫేమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ అంతకుముందు ఒక కారు కొని ఆశ్చర్యపరిచింది.
ఇక ఇప్పుడు సంక్రాంతి కానుకగా మరో కారును కుటుంబానికి ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కియా కార్నివాల్ మోడల్ కారును కొనుగోలు చేసింది. దీని ధర వచ్చి రు. 31 లక్షల నుంచి రూ. 35.5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్ కలర్ కారులో ఫోటోలకు పోజులు ఇస్తూ హిమజ కనిపించింది. ఈ సంక్రాంతికి కొత్త కారును కుటుంబానికి గిఫ్ట్ గా ఇస్తున్నట్లు తెలిపిన హిమజ.. కంఫర్ట్ చాలా ముఖ్యమని అందుకే ఇంత విశాలమైన కారును కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చింది. ఇక దీంతో హిమజ రేంజ్ ఇది అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఏడనుంచి వస్తున్నాయి రా అన్ని డబ్బులు.. కార్ల మీద కార్లు కొంటున్నారు అని అంటుండగా.. ఓ రేంజ్ లో సంపాదిస్తున్నారు.. ఆ టెక్నీక్ ఏంటో మాక్కూడా చెప్పొచ్చుగా అంటూ చెప్పుకొస్తున్నారు.