Thailand: థాయ్‌లాండ్‌లో దారుణం.. 12 మంది స్నేహితులకు సైనైడ్ ఇచ్చి హత్య చేసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: థాయ్ లాండ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 12 మంది స్నేహితులను సైనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తులంతా 33 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారేనని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు డబ్బులే కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
ఓ హత్య విషయంలో విచారణ ప్రారంభించిన తర్వాత 32 ఏళ్ల గర్భిణి సరరత్ రంగ్‌సివుతాపోర్న్‌ను మంగళవారం బ్యాంకాక్‌లో అరెస్టు చేశారు. ఈ నెల ప్రారంభంలో ఆమె స్నేహితురాలు సిరిపోర్న్ ఖాన్వాంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఏప్రిల్ 14న నిందితురాలు రంగ్సివుతాపోర్న్ తన స్నేహితురాలి సిరిపోర్న్ తో కలిసి రచ్చబురి ప్రావిన్స్ కు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ నది వద్ద బౌద్ధ ఆచారంలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో సిరిపోర్న్ కుప్పకూలి చనిపోయింది. శవపరీక్షలో ఆమె శరీరంలో సైనైడ్ గుర్తించారు, గుండె ఆగిపోవడం మరణానికి దారితీసినట్లు తేలింది. ఈ హత్య తర్వాత ఆమె ఫోన్, డబ్బు, బ్యాగులు కనిపించకుండా పోయాయి.
Also Read
- Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
- AO M*urder Case: ఏవో శ్రీహరి హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. నిందితుడి ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య..
- Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
Read Also: Swetha Death Case Mystery: శ్వేత కేసులో మరో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయం..!
విచారణ సందర్భంగా మాజీ ప్రియుడితో సహా 11 మందిని రంగసివుతాపోర్న్ హత్య చేసినట్లు తాము భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారంతా ఇదే తరహాలో మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చనిపోయిన తర్వాత బాధితుల నగదు మాయం అయినట్లు బంధువులు ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు. మరణించిన కొన్ని నెలల తర్వాత శవాలలో సైనైడ్ ను గుర్తించవచ్చు. సైనైడ్ విషప్రయోగం తర్వాత బాధితుడిని గుండె పోటుకు గురిచేస్తుంది, మైకం, శ్వాస ఆడకపోవడం, వాంతులు లక్షణాలతో బాధితుడు మరణిస్తాడు.
ఈ హత్యలకు డబ్బు కారణమని పరిశోధకులు భావిస్తున్నారని రాయల్ థాయ్ పోలీసు అధికార ప్రతినిధి ఆర్కేయోన్ క్రైథాంగ్ తెలిపారు. అయితే నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగ్సివుతాపోర్న్ ఆరోపణలను ఖండించారు. ఈ హత్యలో ఆధారాలు చూపితే అనుమానితురాలిని సీరియల్ కిల్లర్ గా అభివర్ణించ వచ్చని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
-
Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!