Thailand: థాయ్ లాండ్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఏకంగా 12 మంది స్నేహితులను సైనైడ్ ఇచ్చి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తులంతా 33 నుంచి 44 ఏళ్ల వయసు ఉన్న వారేనని పోలీసులు వెల్లడించారు. డిసెంబర్ 2020 నుంచి ఏప్రిల్ 2023 మధ్య ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. హత్యలకు డబ్బులే కారణమని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.