Rare Earth Elements: దేశంలో 8.52 మిలియన్ టన్నుల ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’.. చైనా ఆధిపత్యానికి చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rare Earth Elements: ఎలక్ట్రానిక్స్, పర్మినెంట్ అయస్కాంతాలు, గ్రీన్ ఎనర్జీ, డిఫెన్స్, బ్యాటరీలు, టచ్ స్క్రీన్ల వంటి వాటి తయారీలో “రేర్ ఎర్త్ ఎలిమెంట్స్”గా పిలుబడే భూమిలో అత్యంత అరుదుగా లభించే మూలకాలు కీలకంగా మారాయి. అయితే, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతుల్లో ప్రపంచవ్యాప్తంగా చైనా గుత్తాధిపత్యం నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ఎగుమతుల్ని ఈ దేశమే నియంత్రిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సేకరణ కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో మొత్తం 8.52 మిలియన్ టన్నుల ‘‘అరుదైన భూమి మూలకాలు’’ ఉన్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, గుజరాత్ మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో తీరప్రాంత బీచ్, తేరి మరియు ఎర్ర ఇసుక మరియు లోతట్టు ఒండ్రుమట్టిలో లభించే 13.15 మిలియన్ టన్నుల మోనాజైట్ (థోరియం, అరుదైన భూమి ఖనిజం)లో సుమారుగా 7.23 మిలియన్ టన్నుల అరుదైన రేర్ ఎర్త్ ఆక్సైడ్స్(REO) ఉందని, మరో 1.29 మిలియన్ టన్నుల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ గుజరాత్, రాజస్థాన్ కొన్ని ప్రాంతాల్లోని కఠినమైన రాళ్లలో ఉన్నట్లు బుధవారం పార్లమెంట్‌కు సమాచారం అందింది.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
Read Also: Vikarabad: దారుణం.. ప్రియుడు మోసం చేశాడని పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య..
అణుశక్తి శాఖ యొక్క ఒక విభాగమైన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ (AMD) దేశంలోని పలు ప్రాంతాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ని అన్వేషిస్తోందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. కొన్ని దేశాలు విధించిన అరుదైన భూమి అయస్కాంతాలపై ఎగుమతి పరిమితుల నుండి ఉత్పన్నమయ్యే సవాళ్లను తగ్గించడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ సంబంధిత వాటాదారులతో చురుకుగా చర్చిస్తోందని మంత్రి చెప్పారు.
గనుల మంత్రిత్వ శాఖ ఆస్ట్రేలియా, అర్జెంటీనా, జాంబియా, పెరూ, జింబాబ్వే, మొజాంబిక్, మలావి, కోట్ డి’ఐవోయిర్ వంటి అనేక దేశాల ప్రభుత్వాలతో మరియు అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) వంటి అంతర్జాతీయ సంస్థలతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకుందని చెప్పారు. గనుల మంత్రిత్వ శాఖ జాయింట్ వెంచర్ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(KABIL)ను ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అర్జెంటీనాలోని లిథియం బ్లాకుల అన్వేషనతో పాటు బ్రెజిల్, డొమినికన్ రిపబ్లిక్‌తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!