Son Gives One Crore To Kill His Father In Karnataka: మానవ సంబంధాలు రానురాను మంటగలిసిపోతున్నాయి. డబ్బుల కోసం.. సొంత మనుషుల్నే కడతేరుస్తున్నారు. అడ్డు తొలగించుకుంటే, ఆస్తంతా తమకే దక్కుతుందన్న ఉద్దేశంతో.. తామే చంపడమో, సుపారీ ఇచ్చి చంపించడమో చేస్తున్నారు. ఇప్పుడో కసాయి కూడా అలాంటి దారుణానికే పాల్పడ్డాడు. ఆస్తి కోసం.. కన్న తండ్రి హత్యకు రూ.1 కోటి సుపారీ ఇచ్చాడు. చివరికి అడ్డంగా బుక్కై.. కటకటాలపాలయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌కి ఝలక్.. ఐపీఎల్ నుంచి బుమ్రా ఔట్
కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న కృష్ణరాజపురంలో నారాయణస్వామి (70) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. ఆయనకు మణికంఠ అనే కుమారుడు ఉన్నాడు. ఆస్తి విషయమై మణికంఠ తన తండ్రితో ఎప్పుడూ గొడవలు పడుతుండేవాడు. తన పేరిట ఆస్తి మొత్తం రాయాల్సిందేనని డిమాండ్ చేస్తుండేవాడు. కానీ, తండ్రి అందుకు అంగీకరించేవాడు కాదు. దీంతో.. తండ్రి అడ్డు తొలగిస్తే, ఆస్తంతా తనకే సొంతం అవుతుందని భావించి, తండ్రిని చంపాలని అనుకున్నాడు. తాను నేరుగా చేస్తే ఆ నేరం తన మీదకు వస్తుందని, అలా కాకుండా కిరాయి హంతకులతో ప్లాన్ చేసి చంపిస్తే, తాను తప్పించుకోవచ్చని భావించాడు. తనకు తెలిసిన వ్యక్తుల సహకారంతో కిరాయి హంతకుల గురించి తెలుసుకున్న మణికంత.. తన తండ్రి హత్యకు వారితో రూ.1 కోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన ప్రమేయం ఉన్న సంగతి బయటపడకుండా.. పక్కా ప్లాన్‌తో హత్య చేయాలని సూచించాడు.
MLC Jeevan Reddy: మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదు.. జీవన్‌రెడ్డి హెచ్చరిక
సుపారీ అందుకున్న కిరాయి హంతకులు.. నారాయణ స్వామిని మారతహళ్లి పీఎస్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్ స్థలంలో నరికి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత సుపారీ హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా.. మణికంఠే సుపారీ ఇచ్చి, తన తండ్రి హత్య చేయించాడని వాళ్లు తెలిపారు. దీంతో.. అతడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్తి గొడవల కారణంగా.. తాను తన తండ్రి హత్య చేయించానని మణికంఠ నేరం ఒప్పుకున్నాడు.
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం.. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం