Extramarital Affair: వివాహేతర సంబంధానికి యువకుడు బలి.. అసలు ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddipet Boy Commits Suicide In Extramarital Affair Issue: వివాహేతర సంబంధాలు కాపురాల్ని కూల్చడమే కాదు.. ప్రాణాలు కూడా పోతున్నాయి. భర్తల్ని భార్యలే కడతేర్చడమో, కోపంతో రగిలిపోయి భర్తలే తమ భార్యల్ని చంపడమో వంటి నేరాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా తెరమీదకొచ్చాయి. ఇప్పుడు ఓ యువకుడు కూడా ఈ వివాహేతర సంబంధం వ్యవహారంలో సూసైడ్ చేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ఊహించని షాక్.. ఆ ఇద్దరు ఔట్?
Also Read
- Cyber Crime Recovery Mela: సైబర్ క్రైమ్ రికవరీ మేళా.. 310 మంది బాధితులకు రూ.6 కోట్ల రికవరీ చెక్కులు..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Ganja Smuggling : శంషాబాద్‌లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
- Rajasthan: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రాజస్థాన్‌ను కుదిపేస్తున్న ఘటన..
సిద్ధిపేట జిల్లా కునూరుపల్లి మండలం మంగోల్‌కు చెందిన ఓ యువకుడు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ షాపులో పని చేస్తున్నాడు. అతనికి అక్కడే పనిచేస్తున్న ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెకు అప్పటికే పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వారి మధ్య పరిచయం, కొంతకాలం తర్వాత వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీళ్లిద్దరు ఎవరికి తెలియకుండా.. తమ రాసలీలలు కొనసాగించారు. అయితే.. ఇంతలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం అయ్యింది. అప్పటినుంచి అతనికి చనువుగా ఉంటూ, ఆ యువకుడ్ని దూరం పెట్టింది. తనని దూరం పెట్టడంతో, ఆ యువకుడు మానసికంగా కుంగిపోయాడు.
Imran Nazir: ఓడిపోతామనే భయంతోనే రావట్లేదు.. నిప్పులు చెరిగిన ఫ్యాన్స్
ఎందుకిలా చేస్తోందని ఆరా తీయగా.. మరో వ్యక్తితో ఆమె చనువుగా ఉన్నట్లు గుర్తించాడు. దీన్ని ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. ఆ వ్యక్తికి దూరంగా ఉండాలని కోరాడు. కానీ, ఆమె నిరాకరించింది. ఇది జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు, తన స్వగ్రామంలోని పొలానికి వెళ్లి, పురుగుల మందు తాగాడు. తన కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పి, కుప్పకూలాగాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
-
Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
-
HYDRA Operation: హస్మత్‌పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
-
Smartphone Theft: ఫోన్ పోయిందా? మొదటి 15 నిమిషాల్లో ఈ పనులు చేయకపోతే డేటా, డబ్బు రెండూ పోవచ్చు
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!