Another Big Blow To Karnataka Knight Riders: ఓవైపు ఐపీఎల్ 2023 సీజన్ సమీపిస్తుంటే.. మరోవైపు ఆయా జట్లకు ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. అనుకోని కారణాల వల్ల ఆటగాళ్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైటర్స్‌కి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఇప్పటికే వెన్ను సమస్య కారణంగా శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇప్పుడు మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఈ సీజన్‌కు దూరం కాబోతున్నారని సమాచారం. వాళ్లే.. నితీష్ రానా, లోకీ ఫెర్గ్యూసన్.
Imran Nazir: ఓడిపోతామనే భయంతోనే రావట్లేదు.. నిప్పులు చెరిగిన ఫ్యాన్స్
కోల్‌కతా ఆటగాళ్లలో నితీష్ రానా కీలక ఆటగాడు. ఇతడు పరుగుల వర్షం కురిపించడంలో దిట్ట. జట్టు సమస్యల్లో ఉన్న ప్రతీసారి.. భారీ ఇన్నింగ్స్ ఆడుతూ, గట్టెక్కిస్తుంటాడు. ఇతడు ఆడిన కొన్ని కీలక ఇన్నింగ్స్ కారణంగా.. కోల్‌కతా విజయతీరాలకు చేరిన సందర్భాలున్నాయి. అయితే.. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో రానా యాంకిల్ (చీలమండ)కు గాయమైనట్లు తేలింది. దీంతో ఇతగాడు ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్టు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇక స్టార్ బౌలర్ ఫెర్గ్యూసన్ విషయానికొస్తే.. ఇతడు కూడా గాయం (హ్యామ్‌స్ట్రింగ్) బారిన పడ్డాడు. స్వదేశంలో శ్రీలంకతో జరగాల్సిన వన్డే సిరీస్‌కు ముందు అతనికి గాయం కావడంతో.. తొలి వన్డేకు అతడు దూరంగా ఉంటాడని కివీస్ యాజమాన్యం ప్రకటించింది. ఒకవేళ ఇతనికి అయిన గాయం తీవ్రమైతే మాత్రం.. ఐపీఎల్‌కి దూరం కావొచ్చు.
Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు
అయితే.. ఫెర్గూసన్ గాయం తీవ్రతపై ఇంకా పూర్తి సమాచారం లేదు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు గానీ, కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం గానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ అతనికైన గాయం చిన్నదే అయితే.. ఐపీఎల్‌లో తప్పకుండా పాల్గొంటాడు. ఏదేమైనా.. ముగ్గురు ఆటగాళ్లకు ఇలా గాయాల బారిన పడటంతో, కేకేఆర్ యాజమాన్యం ఆందోళనలో పడింది. కాగా.. ఇక ఐపీఎల్-16వ సీజన్ మార్చి31 నుంచి ప్రారంభం అవుతుండగా, కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో ఏప్రిల్ 2న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.